ETV Bharat / business

ఆస్తిపై లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి! - LOAN AGAINST PROPERTY MISTAKES

ఆస్తిపై రుణం తీసుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దు!

Loan Against Property Mistakes
Loan Against Property Mistakes (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2024, 12:33 PM IST

Loan Against Property Mistakes : చాలా మందికి స్థిరాస్తులు ఉంటాయి. కానీ అనేక ముఖ్యమైన ఖర్చులు, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి వారి దగ్గర సరిపడా నిధులు ఉండకపోవచ్చు. వీరు వ్యక్తిగత, వ్యాపార అవసరాల కోసం ఆస్తిపై రుణం తీసుకోవచ్చు. ఉన్నత విద్య, వివాహా ఖర్చులు, వైద్యం, వ్యాపార విస్తరణ కోసం నిధులు అవసరమవుతాయి. ఇలాంటప్పుడు వారి దగ్గరున్న స్థిరాస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల వద్ద రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు కూడా తనఖాగా ఆస్తి ఉంటుంది కాబట్టి, తక్కువ వడ్డీ రేటుకే వేగంగా రుణాలు మంజూరు చేస్తాయి.

రుణగ్రహీత తన గృహం, దుకాణం, కార్యాలయం, వర్క్‌ షాప్‌ , ఫ్యాక్టరీ, నివాస, వాణిజ్య సముదాయాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆస్తిపై లోన్​ను తీసుకోవచ్చు. ఆస్తిపై లోన్ అనేది సురక్షిత రుణం. ఇలా ఆస్తిపై రుణం తీసుకునేటప్పుడు చేయకూడని 5 తప్పులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వడ్డీ రేట్లు
ఆస్తిపై రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లను పరిశీలించాలి. ఆస్తిపై లోన్ అనేది సురక్షిత రుణం. బ్యాంకుల వద్ద మీ ఆస్తి తనఖా ఉంటుంది కాబట్టి వడ్డీ రేటు వ్యక్తిగత రుణాల కన్నా తక్కువే ఉంటుంది. వడ్డీ రేటు ఎక్కువ ఉండే బ్యాంకు వద్ద లోన్ తీసుకుంటే ఆ ప్రభావం లోన్ వ్యవధిలో మీరు తిరిగి చెల్లించే మొత్తంపై పడుతుంది. అలాగే ఈఎంఐ భారం కూడా పెరిగిపోతుంది. అందుకు పలు బ్యాంకుల్లో ఆస్తిపై లోన్ వడ్డీ రేట్లను పరిశీలించి, రుణం తీసుకోవడం మంచిది.

లోన్ అమౌంట్
ఆస్తిపై లోన్​ను తీసుకునేటప్పుడు మరొక కీలక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు అవసరమైనంత రుణం మాత్రమే తీసుకోవాలి. లేదంటే మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అవసరమైన దానికంటే పెద్దమొత్తంలో లోన్ తీసుకుంటే తిరిగి చెల్లించేటప్పుడు ఇబ్బందులు పడతారు. ఇది మీ నెలవారీ బడ్జెట్​ను దెబ్బతీస్తుంది. మీ ఆర్థిక స్తోమతకు మించిన మొత్తంలో లోన్ తీసుకోకపోవడం ఉత్తమం. ఆస్తిపై రుణం తీసుకున్నప్పుడు చెల్లింపుల్లో ఆలస్యమయితే, బ్యాంకు పెనాల్టీ విధిస్తుంది. అలాగే లోన్​పై డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి కారణాల వల్ల రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరు కూడా ప్రభావితమవుతుంది. దీంతో భవిష్యత్తులో లోన్లు మంజూరు అవ్వడం కష్టమవుతుంది.

అగ్రిమెంట్
లోన్ తీసుకునేటప్పుడు ఫైన్ ప్రింట్​ను క్షుణ్ణంగా చదవాలి. లేదంటే ఆస్తిపై రుణాలు తీసుకున్న ఇబ్బందులు పడతారు. బ్యాంక్ లోన్​పై విధించే ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ పెనాల్టీలు, ఆలస్య చెల్లింపు ఛార్జీలు, ఇతర ఖర్చులు ఫైన్ ప్రింట్​లో ఉంటాయి. అందుకే ఫైన్ ప్రింట్​ను చదివి లోన్ తీసుకోవాలి. లేదంటే అదనపు ఖర్చు వల్ల లోన్ మొత్తం పెరిగిపోతుంది. వడ్డీ రేటు, లోన్ అమౌంట్ మాత్రమే కాకుండా పలు ముఖ్యమైన వివరాలను తెలుసుకోవాలి.

రీపేమెంట్ కెపాసిటీ
మీ ఆదాయం కంటే అధిక ఈఎంఐతో లోన్ తీసుకోవడం వల్ల మీ నెలవారీ బడ్జెట్​పై భారం పడుతుంది. దీంతో కిరాణా, కరెంట్, వాటర్ బిల్లులు, అత్యవసర ఖర్చుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ ఆర్థిక సామర్థ్యానికి మించిన రీపేమెంట్‌ ను ఎంచుకోవద్దు.

ప్రత్యామ్నాయ మార్గాలు
పలు రకాల లోన్లు వివిధ రకాల వడ్డీ రేట్లు, ఫీజులు, రీపేమెంట్ నిబంధనలను కలిగి ఉంటాయి. అందుకే మీకు డబ్బు అవసరం అయినప్పుడు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు, కుటుంబ సభ్యుల వద్ద అప్పు తీసుకోవడం వంటి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. తక్కువ వ్యవధిలో బహుళ రుణాల కోసం దరఖాస్తు చేయడం మీ క్రెడిట్ స్కోర్​పై ప్రభావం చూపుతుంది.

ఆస్తిపై లోన్ వల్ల ప్రయోజనాలు

  • ఈజీ అప్లికేషన్ ప్రాసెస్
  • రుణ కాల వ్యవధి 15 ఏళ్ల వరకు ఉంటుంది.
  • పారదర్శకంగా ప్రాసెసింగ్ ఫీజు

అసురక్షిత రుణాలతో పోలిస్తే తక్కువ వడ్డీ రేట్లు

  • అధిక రుణ మొత్తం
  • రుణాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై ఎలాంటి పరిమితులు లేవు. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి లేదా వ్యక్తిగత అవసరాల కోసం లోన్ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.
  • రుణాన్ని పొందేందుకు ఉపయోగించిన ఆస్తిపై మీరు యాజమాన్యాన్ని కలిగి ఉంటారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.