తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

"నిన్ను బాడీ షేమింగ్​ చేస్తున్నానా" - కంటెస్టెంట్లకు హోస్ట్​ నాగ్​ కౌంటర్లు - ప్రోమో అద్దిరిపోయింది! - BIGG BOSS 8 TELUGU WEEKEND PROMO

-వీకెండ్​ ప్రోమో అదుర్స్​ -యష్మీకి గట్టిగానే వార్నింగ్​ ఇచ్చిన నాగ్​

Bigg Boss 8 Telugu Weekend Promo
Bigg Boss 8 Telugu Weekend Promo (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 4:04 PM IST

Bigg Boss 8 Telugu Weekend Promo: బిగ్​బాస్​లో నేటి ఎపిసోడ్​కు సంబంధించి ప్రోమో రిలీజ్​ చేశారు​ నిర్వాహకులు. సాధారణంగా శనివారం ఎపిసోడ్​ అంటేనే నాగార్జున ఫుల్​ ఫైర్​ మీద ఉంటారు. వారం రోజుల పాటు ఏఏ కంటెస్టెంట్లు తప్పు చేశారో.. వాటిని ఎత్తి చూపుతూ గట్టిగానే కౌంటర్లు ఇస్తారు. తాజాగా నేటి ఎపిసోడ్​లో కూడా అదే జరిగింది. ఈ రోజు కూడా కంటెస్టెంట్లను గట్టిగానే తగులుకున్నారు నాగార్జున. ఇంతకీ ప్రోమోలో ఏం జరిగిందో మీరూ ఓ లుక్కేయండి..

బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోలో నాగార్జున కంటెస్టెంట్ల ఫొటోలు ఉంచిన కుండలను స్టేజ్ మీద పెట్టి బేస్ బాల్ బ్యాట్‌తో ఎంట్రీ ఇచ్చారు. గత వారం నామినేషన్స్ థీమ్ కూడా ఇదే కాబట్టి అలానే ఉతకడానికి రెడీ అయ్యారన్నమాట. అయితే వచ్చీ రాగానే పృథ్వీని టార్గెట్​ చేశారు. అతన్ని నిల్చోబెట్టి పై నుంచి కింద వరకూ ఓ లుక్ ఇచ్చారు నాగ్. నామినేషన్స్ టైమ్‌లో సేమ్ ఇలానే రోహిణిని చూశాడు పృథ్వీ. దీంతో దానిపై సెటైర్ వేశారు నాగార్జున. "కింద నుంచి పైకి చూస్తేనే నీకు ఆ ఆలోచన వచ్చింది కదా" అని నాగార్జున అంటే.. "నా ఇంటెన్షన్ అది కాదు సార్" అంటూ పృథ్వీ అన్నాడు. దీనికి "నా ఇంటెన్షన్ కూడా అది కాదు.. నిన్ను బాడీ షేమింగ్ చేస్తున్నానా" అంటూ కౌంటర్ ఇచ్చారు నాగ్.

ఇక పృథ్వీ గురించి మాట్లాడగానే నిఖిల్ గురించి మాట్లాడక తప్పదు అంటూ నాగార్జున అన్నారు. "సంచాలక్‌గా నీ డెసిషన్స్ కరెక్టా కాదా అనేది నాకూ, రాయల్స్‌కి అర్థం కావట్లేదు" అంటూ నాగ్ అన్నారు. వెంటనే తేజను లేపి "సంచాలక్‌గా నిఖిల్ డెసిషన్స్ క్విజ్ టాస్కులో కరెక్టేనా" అంటూ నాగార్జున అడిగారు. దీనికి "కాదని నా అభిప్రాయం సార్.. క్వశ్చన్ అంతా అయిపోయిన తర్వాతే బజర్ నొక్కాలని రెండు సార్లు వార్నింగ్ ఇచ్చాడు సార్​" అంటూ తేజ అన్నాడు. "మరి రాయల్స్ అందరూ పూర్తయిన తర్వాతే నొక్కారా" అంటూ కౌంటర్ వేశారు నాగార్జున. బజర్ నొక్కినందుకు నేను క్వశ్చన్ రిపీట్ చేయకూడదన్నారు.. నేను చేయలేదు కూడా సార్.. తేజ రైట్ అయితే తేజ రైట్.. ప్రేరణ అయితే ప్రేరణ రైట్ అని చెప్పాను" అని నిఖిల్ వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో "తేజ నీ కుట్ర నువ్వు పన్నావన్నమాట" అంటూ నాగ్ సెటైర్ వేశారు.

బిగ్ బాస్ 8: అర్ధరాత్రి గంగవ్వకు గుండెపోటు - తీవ్రంగా భయపడ్డ కంటెస్టెంట్లు - అప్​డేట్​ ఇచ్చిన నిర్వాహకులు!

ఇక ఆ తర్వాత యష్మీని లేపి "యష్మీ.. విష్ణుప్రియను ఎందుకు నామినేట్ చేశావ్" అంటూ నాగార్జున అడిగితే "అంటే 7 వారాల్లో ఎక్కడా తన ఇండివీడ్యువల్ గేమ్ నాకు కనిపించలేదని చేశా సార్" అంటూ యష్మీ చెప్పింది. "దీనికి నువ్వేం చేస్తున్నావ్" అంటూ కౌంటర్​ వేశారు. అంటే ఇండైరెక్ట్‌గా నిఖిల్ వెనకాల తిరుగుతున్నావ్ అంతేగా అనే మీనింగ్‌లో చెప్పారు నాగార్జున. ఇక హరితేజను కూడా లేపి.. నువ్వు, నయని పావని ఏ క్లాన్​లో ఉన్నారు​ అని నాగ్​ క్వశ్చన్​ చేయగా.." కచ్చితంగా సర్​.. తేజ. మెహబూబ్​, అవినాష్, గంగవ్వ.. యూనానిమస్​గా రోహిణిని సెలక్ట్​ చేస్తారని తెలుసు సర్​" అంటూ హరితేజ డిఫెండ్​ చేసుకుంది.

ఇక ప్రోమో చివరిలో గౌతమ్‌పైన కూడా గట్టిగానే కౌంటర్లు వేశారు నాగార్జున. "నువ్వు మెగా చీఫ్ కాగానే ఉమెన్స్ వీక్ డిక్లర్ చేస్తున్నావ్.. అయితే.. ఇవన్నీ చెప్పడానికి చాలా బావుంటాయ్" అంటూ నాగార్జున అన్నారు. షార్ట్ టెంపర్ వచ్చేసింది సర్​ అంటూ గౌతమ్ అంటే "ఓహో కోపంలో ఓ మాట, షార్ట్ టెంపర్‌లో ఓ మాట, ఇష్టం ఉంటే ఓ మాట, ఇష్టం లేకపోతే ఓ మాట.. వీకెండ్‌లో ఓ మాట అంతేగా" అంటూ కౌంటర్​ వేశారు నాగార్జున. దీంతో ఏం చెప్పాలో తెలియక తెల్ల మొహం వేశాడు గౌతమ్​.. మరి ఆ ప్రోమో మీరూ చూసేయండి.

బిగ్​బాస్ 8: "ఇక ఆపేద్దాం" - విష్ణుప్రియ,​ పృథ్వీరాజ్​ బ్రేకప్​ - అర్ధరాత్రి ఏం జరిగింది?

బిగ్​బాస్​ 8: ఏడో వారం నాగ మణికంఠ అవుట్​ - ఉండలేనంటూ సెల్ఫ్​ ఎలిమినేషన్​ - రెమ్యునరేషన్​ వివరాలివే!

ABOUT THE AUTHOR

...view details