Ram Gopal Varma Tweet on Sonia Akula:బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఇప్పటికే మూడు వారాలు పూర్తయింది. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్ బాషా, మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ కాగా.. నాలుగో వారం మరొకరిని బయటికి పంపేందుకు సోమవారం నామినేషన్స్ జరగగా.. ఆ రాత్రి నుంచే ఓటింగ్ ప్రారంభమైంది. అయితే, ఈ క్రమంలోనే ఎలిమినేషన్ అంచున ఉన్న ఓ అమ్మాయి కోసం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. ఆమెకు ఓటు వేయాలంటూ అభిమానులకు కోరుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. సోనియా ఆకుల. మరి సోనియా గురించి ఆర్జీవీ ఏమని ట్వీట్ చేశారో ఇప్పుడు చూద్దాం..
ఎనిమిదో సీజన్‌లోకి మొత్తం 14 మంది సెలెబ్రిటీలు ఎంటర్ కాగా.. అందులో తెలుగు అమ్మాయి సోనియా ఆరంభంలోనే అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. అందుకు తగ్గట్లుగానే హౌస్‌లోనూ తొలి రోజుల్లో ఎంతో యాక్టివ్‌గా ముందుకు సాగింది. కానీ, ఆ తర్వాత నుంచి తన ప్రవర్తనతో తరచూ విమర్శలను ఎదుర్కొంటూ వస్తుంది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సోనియా.. నిత్యం పృథ్వీరాజ్, నిఖిల్ పక్కనే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నాలుగో వారం ఇంటి నుంచి వెళ్లేందుకు నామినేట్ కాగా.. అన్అఫీషియల్ పోల్స్‌లో తక్కువ ఓట్లతో ఈమెనె లాస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి దిగిన ఆర్జీవీ:ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆమె కోసం రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆమెకు ఓట్ వేయాలని అభిమానులను కోరుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'సోనియా ఆకుల.. బలం, యాటిట్యూడ్‌కు నిదర్శనం. ఈ అమ్మాయి బిగ్ బాస్‌లో చాలా బాగా ఆడుతోంది. మీ ఓటును సోనియాకు వేసి ప్రేమను చూపించండి' అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు సోనియాతో దిగిన ఫొటోను సైతం షేర్ చేశారు.