Bigg Boss 8 Telugu Love Track : బిగ్‌బాస్ అంటే ఓ పక్క గొడవలు.. మరో పక్క లవ్ ట్రాక్ నడవడం మామూలు విషయమే. అయితే.. ఈ సీజన్లో ఫస్ట్ వీక్‌లో అలాంటి సూచన ఏదీ కనిపించలేదు. అయితే.. తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తే మాత్రం.. ఈ సారి కూడా ప్రేమాయణం కన్ఫామ్ అంటున్నారు జనాలు. అయితే.. అది ఇద్దరి మధ్యనే ఉంటుందా? లేదా.. ట్రయాంగల్ లవ్ స్టోరీనా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు. మరి.. ఇంతకీ కాబోయే ప్రేమ పక్షులు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆ ముగ్గురే..
పృథ్వీ, నిఖిల్, సోనియా మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. వీరు మాట్లాడిన సమయంలో వచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్.. లవ్ ట్రాక్ ఉంటుందనే థాట్ తీసుకొచ్చింది. "నిజమైన ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి" అని విష్ణుప్రియ అంటోన్న సమయంలో సోనియా.. పృథ్వీ హ్యాండ్‌ని పట్టుకుని క్యూట్‌గా బిహేవ్ చేస్తుంటుంది. దీనిపై స్పందించిన విష్ణుప్రియ.. "పృథ్వీ ఎంతమందికైనా ప్రేమను పంచొచ్చు"అని మరో పంచ్ వేసింది. దీంతో అక్కడ ఉన్న కంటెస్టెంట్లు అందరూ నవ్వేశారు.
ఆ తర్వాత నిఖిల్ దగ్గర కూర్చున్న సోనియా.. "నువ్వు సిగరెట్ తాగకుండా ఉండరా.. నువ్వు ఏమడిగినా ఇస్తా" అని సోనియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో నీళ్లు తాగుతున్న నిఖిల్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ సమయంలోనూ వీరిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందనేలా ప్రోమోలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ వినిపించింది. దీనికి సోనియా సిగ్గుపడిపోగా.. నిఖిల్ కూడా నవ్వుతూ మీసాలు మెలేశాడు.
దీనికి సీత.. "దే ఫౌండ్ ఈచ్ అదర్" అనగానే.. "గాడ్ మస్ట్ బి క్రేజీ అంటే ఇదే"అని అభయ్ నవీన్ అన్నాడు. "చూసేవన్నీ నిజాలు కాదం"టూ మరో కౌంటర్ కూడా వేశాడు. అయితే.. సోనియా ఇదంతా కావాలనే స్ట్రాటజీతో చేస్తోందా? లేదా అటు నిఖిల్, ఇటు పృథ్వీరాజ్‌ని తన వైపు తిప్పుకోవాలని చూస్తోందా? అనే విషయం తేలాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. చూస్తుండగానే బిగ్‌బాస్ సీజన్-8 తొలివారం ముగిసింది. తన మాటలు, ప్రాసలు, పంచ్‌డైలాగ్స్‌తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. విష్ణు ప్రియ, బేబక్క, సోనియా, పృథ్వీరాజ్, శేఖర్ బాషా, నాగ మణికంఠలు ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వగా చివరకు బేబక్క, మణికంఠ మిగిలారు. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు వచ్చిన బేబక్క ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.