ETV Bharat / entertainment

టెక్సాస్ ఫ్యాన్​ మీట్​లో చెర్రీ సందడి - 'ఈ సారి మిమల్ని అస్సలు నిరాశపరచను' - RAM CHARAN TEXAS FAN MEET

టెక్సాస్​లో ఫ్యాన్​ మీట్​ - ఈ సారి అభిమానును నిరాశపరచనన్న చెర్రీ

Ram Charan Texas Fan Meet
Ram Charan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Ram Charan Texas Fan Meet : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత సోలో సినిమాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. శంకర్ తెరకెక్కిస్తోన్న 'గేమ్ ఛేంజర్​'తో సంక్రాంతికి థియేటర్లలోకి రానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్​కు డైరెక్టర్ సుకుమార్‌, బుచ్చిబాబు అలాగే నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అయితే ఇందుకోసం ఇప్పటికే అమెరికా వెళ్లిన చెర్రీ తాజాగా టెక్సాస్‌లో జరిగిన ఓ ఫ్యాన్‌ మీట్‌లో పాల్గొన్నారు. అక్కడి అభిమానులతో ముచ్చటించి సినిమా గురించి పలు కీలక విషయాలు పంచుకున్నారు.

"నాకు, దిల్‌రాజుకు సంక్రాంతి ఎప్పుడూ స్పెషలే. ఆ పండుగ మాకు ఎన్నో విజయాలను ఇచ్చింది. అయితే నా సోలో సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ల పైనే అవుతుంది. మధ్యలో నా బ్రదర్‌ ఎన్​టీఆర్​తో కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం వర్క్ చేశాను. ఇక 'గేమ్‌ ఛేంజర్‌' కోసం మా టీమ్ మొత్తం చాలా కష్టపడ్డాం. డైరెక్టర్ శంకర్‌ స్టైల్‌ను మీరందరూ మరోసారి చూసి ఎంజాయ్‌ చేస్తారు. ఫ్యాన్స్​ను ఈ సారి నేను ఎట్టిపరిస్థితుల్లోనూ నిరాశపరచను" అని చెర్రీ అన్నారు. ఇక ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు పంచుకుంటానని చెప్పారు.

చెర్రీ డ్యూయెల్ రోల్​
మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్​ రోల్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాలేజీ స్టూడింట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారిన చరణ్ విలన్‌లను ఎలా ఎదుర్కొన్నారనేది ఈ సినిమా కథగా చూపించనున్నట్లు అర్థమవుతోంది. మరో పాత్రలో చెర్రీ ఓ రైతు నాయకుడిగా కనిపించనున్నారు. మొత్తంగా ఈ సినిమా టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో పవర్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటం వల్ల అభిమానులు బాగా థ్రిల్ అవుతున్నారు.

ఇక ఈ మూవీలో చరణ్​తో పాటు అంజలీ, యస్​ జే సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషనల్ ఈవెంట్స్​ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

'ఇండియన్ 2 రిజల్ట్​ అస్సలు ఊహించలేదు - గేమ్ ఛేంజర్ విషయంలో అలా జరగదు'

రిలీజ్​కు ముందే 'గేమ్ ఛేంజర్' దూకుడు - బాలయ్య సినిమాను వెనక్కినెట్టి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.