Bigg Boss 8 Telugu First Week Nominations: బిగ్‌బాస్ లాంఛింగ్ ఎపిసోడ్ కంటే.. కిక్ ఇచ్చే ఎపిసోడ్ అంటే సోమవారం నాటి నామినేషన్స్ ఎపిసోడే. అయితే గత అన్ని సీజన్లలో ప్రతి సోమవారం హౌజ్‌లో నామినేషన్స్ జరిగాయి. కానీ ఈ సీజన్ 8లో మంగళవారం నాడు నామినేషన్స్ ప్రక్రియను చేపట్టారు. దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లోనే కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సీజన్ 8లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ హీట్ ఊపందుకుంది. హౌజ్‌లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ మధ్య తొలివారం నామినేషన్స్ మొదలయ్యాయి. సాధారణంగా బిగ్‌బాస్ హౌజ్‌లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ అంటే కాస్త సిల్లీగానే ఉంటాయి. ఎందుకంటే వీళ్లు చెప్పే కారణాలు అలా ఉంటాయి. ఐ కాంటాక్ట్ ఇవ్వలేదని.. హాయ్ చెప్పలేదని.. నలుగురితో కలవడం లేదని.. ఇలా కారణాలు చెప్పి నామినేషన్స్ వేస్తుంటారు. తొలివారం నామినేషన్స్‌లో కూడా చాలా వరకూ ఇవే కనిపించాయి. ఇక ప్రోమో చూస్తే..
బిగ్‌బాస్ హౌస్‌కి చీఫ్‌గా ఎన్నికైన ముగ్గురు నిఖిల్, నైనిక, యష్మీ గౌడ.. ఇమ్యూనిటీ పొంది నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. ప్రోమో స్టార్టింగ్‌లో హౌజ్‌లో చీఫ్లుగా సెలెక్ట్ అయిన నిఖిల్, నైనిక, యష్మీ గౌడలను అభినందించిన బిగ్‌బాస్.. మెడలో హారాలను ధరించి వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కుర్చీలలో కూర్చోమని చెప్పారు. ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ మొదలు కానున్నట్లు ప్రకటించారు.
సోనియా Vs బేబక్క:ముందుగా సోనియా ఆకుల.. బెజవాడ బేబక్క, ప్రేరణలు ఫొటోలు సెలెక్ట్ చేసింది. ఇక బేబక్కపై సోనియా బాగానే విరుచుకుపడింది. ఫుడ్‌కు సంబంధించిన విషయంలో ఈ ఇద్దరి మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగినట్లు ప్రోమో చూపించారు.
నాగమణికంఠ వర్సెస్ శేఖర్ బాషా:ఈ ఇద్దరి మధ్య కూడా హీటెడ్ డిస్కషన్ జరిగింది. "కట్టేసినా కుక్క లాగా భౌ భౌ మనడం నా నేచర్ కాదు" అంటూ నాగమణికంఠ గట్టిగానే ఇచ్చిపడేశాడు. దీనికి శేఖర్ బాషా" యూ ఆర్ నాట్ బిగ్‌బాస్, యూ ఆర్ నాట్ జడ్జ్" అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాదనలు గట్టిగానే జరిగినట్లు ప్రోమోలో చూపించారు.