Nayani Pavani Elimination and Remuneration: బిగ్‌బాస్ సీజన్8 తొమ్మిదో వారంలో నయని పావని ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్‌లోకి ఎంటర్ అయిన నయని మొదట్లో తన ఆటతీరు, మాట తీరుతో అందరిని ఆకర్షించింది. ఆ తర్వాత ప్రతి చిన్న దానికి ఏడుస్తూ ఆటపై ఫోకస్ కోల్పోయి, క్రై బేబి ట్యాగ్‌ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తొమ్మిదో వారం నామినేషన్స్‌లోకి వచ్చి ఇంటి బాట పట్టింది. ఇక నాలుగు వారాలు బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న నయని భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తొమ్మిదోవారం నామినేషన్స్‌లో ఐదుగురు ఉండగా.. ఒక్కొక్కరూ సేవ్ అవుతూ చివరి వరకూ నయని పావని, హరితేజలు ఉన్నారు. తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా నయని ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అనంతరం వేదికపైకి వచ్చిన ఆమె తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయింది. ఈ క్రమంలో హౌజ్‌లో ఉన్న వాళ్లలో ఐదుగురు డమ్మీ ఆటగాళ్లు, ముగ్గురు బెస్ట్ ఆటగాళ్లు ఎవరో చెప్పాలని నాగార్జున అడిగారు. దీంతో..
డమ్మీ ఆటగాళ్లు:
గంగవ్వ:"అందరితో పోల్చుకుంటే గంగవ్వ గేమ్ ఆడటం వయసురీత్యా ఆమెకు కష్టం" అని చెప్పింది.
రోహిణి:"కొంచెం సేఫ్‌గా ఆడుతోంది. గొడవ జరిగినప్పుడు ముఖం మీదే మాట్లాడతారు. అవే విషయాలు ఆమె కూడా ఫాలో అవ్వాలి. ఒకరి తప్పు ఎత్తిచూపటం చాలా ఈజీ. మనం కూడా అన్ని విషయాల్లో కరెక్ట్‌గా ఉండాలి. వెనకాల మాట్లాడకూడదు. ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా బాగున్నా.. గేమ్ ఇంకా బాగా ఆడాలి" అని కామెంట్లు చేసింది.
ప్రేరణ: "కోపంలో తెలియకుండా కొన్ని పదాలు వచ్చేస్తున్నాయి. నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే ఎలా అనిపిస్తుందో.. నీ మాటల వల్ల ఎదుటి వాళ్లకూ అలాగే ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి" అని సలహా ఇచ్చింది.
గౌతమ్: "ఒకరి నుంచి మనం ఏదైనా ఆశిస్తున్నామంటే అదే స్థాయిలో మనం కూడా ఇవ్వాలి. ఆ విషయంలో కొంచెం నియంత్రణలో ఉండాలి." అని సూచనలు చేసింది.
విష్ణు: నువ్వు గేమ్ బాగా ఆడతావు. ఫిజికల్లీ, మెంటల్లీ నువ్వు స్ట్రాంగ్. అయితే, ఇప్పుడు ఆడుతున్న గేమ్ సరిపోదు. ఇంకా బాగా ఆడాలి" అంటూ మోటీవేట్ చేసింది.