Bhairavam Movie Heroine : టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం భైరవం. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ వరుస అప్‌డేట్‌లు విడుదల చేస్తున్నారు.
మొదటగా శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేసిన మూవీ టీమ్, రీసెంట్గా మంచు మనోజ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇప్పుడేమో తాజాగా ఈ సినిమా హీరోయిన్ను అఫీషియల్‌గా పరిచయం చేసింది చిత్ర బృందం. సినిమాలో దిగ్గజ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ నటించనున్నట్లు తెలిపింది. అల్లరి పిల్ల వెన్నెలగా అదితి శంకర్ కనిపించబోతున్నట్లు వెల్లడించింది. నేచురల్ బ్యూటీ ప్రజెన్స్‌తో క్యారెక్టర్ ఎసెన్స్‌ను ప్రజెంట్ చేశారు మేకర్స్. పోస్టర్లో అదితి పల్లెటూరి అమ్మాయిలా ఎక్సల్ బండి మీద పాల క్యాన్‌తో కూర్చొని ఎంతో అందంగా కనిపించింది. 'ఇంతకుముందు మీ హృదయాలను దోచలేనంతంగా ఈసారి ఈమె దోచుకుంటుంది' అని మూవీటీమ్ రాసుకొచ్చింది.
Aditi Shankar Movies : అదితి శంకర్ విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మ కార్తి నటించిన విరుమన్ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మావీరన్లో నటించింది. ప్రస్తుతం వన్స్‌మోర్, నెసిప్పాయ చిత్రాల్లో నటిస్తోంది. చెన్నైలో పుట్టిన ఈమెకు చిన్నప్పటి నుంచే నటన, సంగీతం అంటే ఇష్టం. చెన్నైలోని ఓ యూనివర్సీలో ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. వరుణ్ తేజ్ నటించిన గని చిత్రంలో రోమియో జూలియన్ పాట పాడింది.