Unstoppable With NBK S4 :నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4' మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. గత సీజన్లలో ఇప్పటివరకు పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు షోకు గెస్ట్లుగా విచ్చేసి సందడి చేశారు. ఈ నేపథ్యంలో నాలుగో సీజన్లో తొలి ఎపిసోడ్‌కు ఎవరు గెస్ట్‌గా రానున్నారని ఆడియెన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి గెస్ట్ గురించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది.
అయితే గత మూడు సీజన్ల కంటే ఈసారి ప్రేక్షకులకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే తొలి ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగో సీజన్‌కు తొలి గెస్ట్‌గా రానున్నారని తెలుస్తోంది. ప్రోగ్రామ్‌లో ఆయనకు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యిందని సమాచారం. అయితే ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కల్యాణ్ కూడా తొలి ఎపిసోడ్లో కనిపించనున్నారని తెలిసింది. ఆయన ఆదివారం ఈ పోగ్రామ్ షూట్లో పాల్గొనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ఇక తొలి ఎపిసోడ్ తర్వాత పాన్ఇండియా ఫిల్మ్ 'పుష్ప ది రూల్' మూవీ టీమ్ షోకు రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మంధన్నా సెకండ్ ఎపిసోడ్లో గెస్ట్లుగా రానున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా 'కంగువ' టీమ్‌తో సందడి చేయనున్నారట. ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ టాక్ షో ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండనుంది. అక్టోబర్ 24న తొలి ఎపిసోడ్ వచ్చే ఛాన్స్ ఉంది.