Balakrishna NBK 109 Title Update : నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం NBK 109. షూటింగ్ ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని చౌటప్పల్ పరిసర ప్రాంతాల్లో ఎడారి సెట్ వేసుకోని యాక్షన్ సీన్స్ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇప్పటికే NBK 109 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇటీవలే దసరా కానుకగా టైటిల్ అనౌన్స్మెంట్ వస్తుందని అంతా ఆశించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు దీపావళి వేదికగా వస్తుందని అంతా ఆశిస్తున్నారు.
Producer Naga Vamsi NBK 109 : ఈ క్రమంలోనే NBK 109 నిర్మాత నాగ వంశీ టైటిల్ అనౌన్స్మెంట్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. టైటిల్ వీడియో రిలీజ్ చేయడానికి మరింత సమయం పడుతుందని పేర్కొన్నారు.
"నిజానికి బాలయ్య NBK 109 సినిమా టైటిల్‌ను పండగకు విజువల్స్‌తో సహా రూపొందించి అనౌన్స్ చేద్దామనుకున్నాం. ఎందుకంటే పోస్టర్లు వేస్తే ఆ కిక్ రాదు. వీడియో సీజీలతో మూడిపడి ఉంది. కానీ మాకు సీజీ సమయానికి డెలివరీ అవ్వలేదు. అందుకే ఇంకాస్త డిలే అవతుంది. అభిమానులకు సారీ చెబుతున్నాను. టైటిల్‌కు విజువల్, బ్యాంగ్‌తో ఇస్తేనే బాగా హైప్ వస్తుందని బాబీ దాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. కానీ సీజే వర్క్ టైమ్ పుడుతంది. అందుకే డిలే అవుతూ వస్తోంది. నవంబర్ రెండో వారంలో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వారం లేదా పది రోజులు సీజే కోసం సమయం పడుతుంది" అని నిర్మాత నాగ వంశీ చెప్పుకొచ్చారు.