Daaku Maharaaj Day 1 Collections :'డాకు మహారాజ్'తో సంక్రాంతి బరిలో నిలిచిన నందమూరి బాలకృష్ణ మంచి విజయ సొంతం చేసుకున్నారు. బాబి కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12న రిలీజై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ రావడం వల్ల ఫస్ట్ డే థియేటర్లు దాదాపు ఫుల్ ఆక్యుపెన్సీతో రన్ అయ్యాయి. దీంతో డాకు భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ సాధించింది.
ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 56 కోట్లు (గ్రాస్) సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా, బాలయ్య కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌గా నిలిచింది. ఈమేరకు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'డాకు మహారాజ్ మంచి రెస్పాన్స్‌తో ఈ సంక్రాంతికి క్లీన్ హిట్ సొంతం చేసుకుంది. వరల్డ్‌వైడ్‌గా తొలి రోజు రూ.56+ కోట్లు వసూల్ చేసింది' అని క్యాప్షన్ రాసుకొచ్చారు.
ఓవర్సీస్లోనూ హవా
ఓవర్సీస్లోనూ బాలయ్య మేనియా నడుస్తోంది. ఓవర్సీస్‌లో టికెట్స్ ఓపెన్ చేసిన నాటినుంచి బుకింగ్స్‌లో డాకు సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే USAలో తొలిరోజే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.