Avatar 3 Release Date :హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్జేమ్స్ కామెరూన్ తాజాగా 'అవతార్' ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం రానున్నట్లు ఓ ఈవెంట్లో వెల్లడించారు. అదే వేదికగా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. 'అవతార్- ఫైర్ అండ్ యాష్' పేరుతో రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్ 19న కానున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 2029లో 'అవతార్ 4', అలాగే చివరిగా రానున్న 'అవతార్ 5' 2031 డిసెంబరులో విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే వెల్లడించారు.
ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు సినిమాలు విజువల్ వండర్స్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పండోరా గ్రహం, అందులో నివసించే వారి గురించి డైరెక్టర్ చూపించిన తీరు ఆడియెన్స్‌ను అలరించాయి. ఈ చిత్రాల త్రీడీ వెర్షన్ కూడా మూవీ లవర్స్‌ను ఆకర్షించాయి.
160 భాషల్లో బాక్సాఫీస్ బ్రేక్
2009లో విడుదలైన 'అవతార్' మూవీ అప్పటి చిత్ర పరిశ్రమలో ఓ సంచలనంగా నిలిచింది. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ అద్భుత ప్రపంచాన్ని వీక్షించి ప్రేక్షకులు మరో లోకంలోకి వెళ్లిన అనుభూతి పొందారు. పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని పలు అంశాలను కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు వచ్చిన విశేష స్పందనతో ఆ తర్వాత 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'ను విడుదల చేశారు కామెరూన్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైన ఈ సీక్వెల్ మూవీ బాక్సాఫీసు వద్ద ఓ రేంజ్లో వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూడో భాగంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.