తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఏప్రిల్ రిలీజ్​లు- బ్లాక్​బస్టర్​ రూట్​లో చిన్న సినిమాలు!- మీరు ఏది చూస్తారు? - This Week Movie Releases Telugu - THIS WEEK MOVIE RELEASES TELUGU

April Movie Releases 2024 Telugu: 2024 టాలీవుడ్​ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలుగా రిలీజై పలు చిత్రాలు భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. అలా ఈనెల కూడా పలు చిన్న సినిమాలు రిలీజ్​కు రెడీగా ఉన్నాయి. మరి ఆ ఫలితాలను ఈ సినిమాలు రిపీట్ చేస్తాయో చూడాలి.

Summer Releases
Summer Releases

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 8:07 PM IST

April Movie Releases 2024 Telugu:టాలీవుడ్​లో ఈ మధ్య కొన్ని సినిమాలు చిన్న చిత్రాలుగా రిలీజై భారీ విజయాలు అందుకొని కాసుల వర్షం కురిపించాయి. ఈ లిస్ట్​లో జనవరిలో రిలీజైన హనుమాన్, తర్వాత ప్రేమలు, రీసెంట్ బ్లాక్ బస్టర్ 'డీజే టిల్లూ స్వేర్' ఉన్నాయి. అయితే ఈ నెలలో కూడా అలాంటి చిన్న బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ ఫలితాలను ఈ చిన్న సినిమాలు రిపీట్ చేస్తాయా? ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయి? చూద్దాం.

  • మంజుమ్మెల్ బాయ్స్: మలయాళంలో రీసెంట్​గా సూపర్​హిట్ టాక్ అందుకున్న'మంజుమ్మెల్ బాయ్స్' తెలుగు ఆడియెన్స్​ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. కేరళ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో చూసేందుకు చాలా మంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
  • గీతాంజలి మళ్లీ వచ్చింది: కోన వెంకట్ దర్వకత్వంలో తెరకెక్కిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' ఏప్రిల్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా 'గీతాంజలీ'కి సీక్వెల్​గా ఈ సినిమా రూపొందింది. ఇందులో నేచురల్ బ్యూటీ అంజలీ కీలక పాత్రలో నటించగా, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సునీల్, సత్యం రాజేశ్ తదితరులు నటించారు.
  • లవ్​ మీ: దిల్​రాజు ప్రొడక్షన్​ హౌజ్​లో రూపొందిన 'లవ్​ మీ' సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్​గా నటించింది. ఈ సినిమాకు అరున్ భీమవరపు దర్శకత్వం వహించగా, ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమా కోసం ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇక వీటితో పాటు సుహాస్ నటిస్తున్న 'శ్రీ రంగ నీతులు', సత్యం రాజేష్ కీలకపాత్ర పోషించిన 'టెనెంట్', చైతన్యరావు యాక్ట్ చేసిన 'పారిజాత పర్వం' వంటి సినిమాలు కూడా ఏప్రిల్​లోనే థియేటరల్లోకి రానున్నాయి. మరి ఏ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో ఏది మీ సమ్మర్​ను మరింత హ్యాపీగా మార్చుతుందో వేచి చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details