Keerthi Suresh Bollywood Movie Remuneration : హీరోయిన్ కీర్తి సురేశ్ 'బేబి జాన్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ ఈ చిత్రం కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి.
ఇంతకీ ఎంతంటే? - బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమే 'బేబి జాన్'. ఈ చిత్రంతోనే కీర్తి సురేశ్ తొలిసారి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటి వరకు కీర్తి నటించిన సినిమాలు పెద్దగా హిందీలో రిలీజ్ కాలేదు. అందుకే ఇప్పుడు 'బేబి జాన్' చిత్రంతో బీటౌన్‌లో మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తోంది కీర్తి సురేశ్.
ఒక వైపు తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ 'బేబి జాన్' ప్రమోషన్స్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొంది కీర్తి సురేశ్. అయితే సౌత్ సినిమాలకు కీర్తి సురేశ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయంపై అంతగా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు 'బేబి జాన్' కోసం రూ.4 కోట్లు ఛార్జ్ చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
Keerthi Suresh Baby John Movie : కాగా, కోలీవుడ్‌లో విజయ్ దళపతితో కలిసి 'తేరీ' అనే సినిమాను తెరకెక్కించారు దర్శకుడు అట్లీ. ఇప్పుడు ఆ సినిమానే 'బేబి జాన్'గా తెరకెక్కింది. దీనికి దర్శకుడు అట్లీ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జవాన్‌తో ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అట్లీ. ఇప్పటికే బేబీ జాన్ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నైన్ మటాకా అనే పాటలో కీర్తి చేసిన గ్లామర్ షో ఫ్యాన్స్‌ను బాగా అలరించింది. ఇకపోతే రీసెంట్‌గానే తాను ప్రేమించిన ఆంటోని తట్టిల్‌ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది కీర్తి సురేశ్. హిందు, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ కూడా తెలిపారు.
రణ్‌బీర్ కపూర్‌తో అలా చేస్తూ! - లీకైన ఫొటోలపై హీరోయిన్ ఎమోషనల్!!
2024లో ఈ హీరోలు అస్సలు కనిపించలే - 2025 మాత్రం డబుల్ ధమాకాతో!