INDw vs WIw Second T20 : వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘోర పరాజయాన్ని అందుకుంది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని విండీస్ ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే ఛేదించింది.
ఓపెనర్ హేలీ మాథ్యూస్ (47 బంతుల్లో 85*; 17 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. మ్యాచ్‌ను ఏకపక్షం చేసేసింది. మరో క్వినా జోసెఫ్ (22 బంతుల్లో 38; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షెమైన్ (26 బంతుల్లో 29*; 4 ఫోర్లు)తో కలిసి హేలీ మాథ్యూస్ జట్టుకు భారీ విజయాన్ని అందించింది. సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో టీ20 జరగనుంది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. స్మృతి మంధాన (41 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి హాఫ్ సెంచరీతో మెరిసింది. చివర్లో రిచా ఘోష్ (17 బంతుల్లో 32; 6 ఫోర్లు) దూకుడు ప్రదర్శించింది. జెమీమా రోడ్రిగ్స్ (13), దీప్తి శర్మ (17) పరుగులు చేశారు. ఉమా ఛెత్రి (4), రాఘవి బిస్త్ (5), సజీవన్ సజన (2) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, హేలీ మాథ్యూస్, హెన్రీ, డియాండ్రా డాటిన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
బుమ్రా ఆసక్తికర సమాధానంపై స్పందించిన గూగుల్ - ఏం చెప్పిందంటే?