ETV Bharat / entertainment

లైఫ్ పార్ట్​నర్​ గురించి రష్మిక కామెంట్స్- అలా ఉండే వాడు కావాలట! - RASHMIKA HUSBAND

రష్మిక పార్ట్​నర్​కు ఉండాల్సిన క్వాలిటీస్- ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన హీరోయిన్!

Rashmika Husband
Rashmika Husband (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2024, 11:02 AM IST

Rashmika Husband : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మంధన్నా ప్రస్తుతం 'పుష్ప 2' సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు 'గర్ల్​ఫ్రెండ్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆమె అప్పుడప్పుడూ ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. అలా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్‌ గురించి మాట్లాడారు. తనకు ఎలాంటి లైఫ్ పార్ట్​నర్ కావాలో చెప్పారు.

రష్మికకు తనలాంటి మనస్తత్వంమే ఉన్న భాగస్వామి కావాలట. తన జీవితంలోకి రాబోయే లైఫ్ పార్ట్‌నర్‌ ఆమెకు ప్రతీ దశలో తోడుండాలని అన్నారు. 'నా భాగస్వామి జీవితంలో ప్రతీ దశలో నాకు తోడుగా ఉండాలి. అన్ని వేళలా నాకు భద్రత ఇవ్వాలి. జీవితంలో కష్ట సమయంల్లో నాకు మద్ధతుగా నిలవాలి. కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండి తీరాలి. నా పట్ల శ్రద్ధ వహించాలి. మంచి మనసు ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసి ఉండొచ్చు'అని తెలిపారు.

ఈ క్రమంలోనే ఆమె ప్రేమ గురించి కూడా మాట్లాడారు. 'జీవితంలో ప్రతి ఒక్కరికీ ఓ తోడు కావాలి. ప్రేమలో ఉండడం అంటే నా దృష్టిలో భాగస్వామిని కలిగి ఉండడమే. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. మన ఒడుదొడుకుల్లో మనతో ఉంటూ సపోర్ట్‌ చేసేవారు ఉండాలి' అని రష్మిక చెప్పారు.

ఇక రష్మిక ప్రస్తుతం 'పుష్ప 2' సక్సెస్​ను ఆస్వాదిస్తోంది. పాన్​ఇండియా లెవెల్​లో తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అలాగే రష్మిక యాక్షన్​కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా మంచి టాక్​తో రన్ అవుతోంది. దీంతో పాటు ఆమె ది గర్ల్​ఫ్రెండ్ అనే సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. చి.ల.సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. చూస్తుంటే ఇది ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని తెలుస్తోందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఆసక్తికరంగా 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' టీజర్ - విజయ్ దేవరకొండ వాయిస్​తో!

'ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా?' - రష్మిక సమాధానానికి దద్దరిల్లిన ఆడిటోరియం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.