Animal Movie Papa word : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'యానిమల్'. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించారు. పక్కా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
Animal Movie OTT :సాధారణంగా ఓ సినిమా ఓటీటీలో వచ్చిందంటే థియేటర్లలో గుర్తించని ప్లస్ అండ్ మైనస్‌లు, ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌ను ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో గుర్తించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు మూవీ లవర్స్. ఇక అందులో కొన్ని ట్రోల్స్‌కు గురైతే మరికొన్ని ట్రెండ్ అవుతుంటాయి. అలా ఇప్పుడు యానిమల్ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫాదర్ ఎమోషన్‌తో వచ్చిన ఈ సినిమాలో 'నాన్న' అనే పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇప్పుడా నాన్న అనే పదం మొత్తం ఎన్ని సార్లు ఉపయోగించారో తెలిసింది. మొత్తం 196 సార్లు వాడినట్లు ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. సినిమా మొత్తంలో ఎన్నిసార్లు నాన్న పదం వాడారు? ఏ సందర్భంలో వాడారు? వంటివి సీన్స్‌తో 1:26 నిమిషాల నిడివితో వీడియో ఉంది. హిందీ వర్షన్‌కు సంబంధించి ఈ వీడియోను కట్ చేశారు. ఇక తెలుగు డబ్బింగ్లోనూ కూడా దాదాపు అన్ని సార్లే వాడి ఉండొచ్చని అంటున్నారు.