Anant Radhika Wedding :రిలయన్స అధినేత ముకేశ్ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సౌత్, నార్త్ నుంచే కాకుండా అంతర్జాతీయ స్టార్స్ కూడా వచ్చి సందడి చేశారు. రెడ్ కార్పెట్‌పై ఫోజులిస్తూ కనిపించారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఈవెంట్ మెత్తానికే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
పెళ్లికొడుకు అనంత్ అంబానీ బారాత్ వస్తున్న సమయంలో సెలబ్రిటీలు అందరూ కారు ముందర డ్యాన్స్ వేస్తూ కనిపించారు. అందులో జాన్ సీనా, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి స్టార్స్ తమ స్టెప్పులతో అదరగొట్టారు. ఆ సమయంలో రజినీ కూడా హుషారుగా స్టెప్పులేశారు. ప్రముఖ బాలీవుడ్ సాంగ్‌కు సింపుల్‌గా డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
సోలో ఫొటోషూట్ - తలైవా స్వాగ్
ఇక ఈ వేడుకలో పలువురు సినీ, వ్యాపార, క్రీడా సెలబ్రిటీలు సందడి చేశారు. వారిని మీడియా పర్సన్ ఫొటోలు తీశారు. ఇందులో భాగంగా రజినీ తన సతీమణి లత అలాగే చిన్నకుమార్తె సౌంద్యర, అలాగే అల్లుడు ఇంకా మనవడితో ఫొటో దిగారు. ఆ తర్వాత అక్కడి ఫొటోగ్రాఫర్లు ఆయన్ను సోలోగా నిల్చోమని అడిగారు. అప్పుడు ఆయన నడుముపై రెండు చేతులు పెట్టుకుని స్టైలిష్‌గా ఫోజిచ్చారు. ఇది చూసి అక్కడి వారు తలైవా అంటూ అరవడం మొదలెట్టారు. ఈ వీడియో కూడా అంబానీ పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.