Allu Arjun Wax Statue Madame Tussauds: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఆ షూట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి ఆయన తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు వెళ్లారు. సినీ సెలబ్రిటీల మైనపు విగ్రహాలను ఉంచే ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహావిష్కరణ సందర్భంగా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన బన్నీ, పిల్లలు అయాన్, అర్హతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ దుబాయ్ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ సతీమణి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వరల్డ్ మోస్ట్ ఫేమస్ బుర్జ్ ఖలీఫాకు కూడా వెళ్లారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ ఫొటోల్లో అయాన్, అర్హ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఓ షాపింగ్ మాల్లో హుషారుగా తిరిగేస్తూ అల్లరి చేశారు.ఫొటోలు చూసిన అల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇప్పటి వరకు టుసాడ్స్‌లో సందడి చేసిన టాలీవుడ్ సినీ తారలు వీరే :
ఇక ప్రపంచంలోని పలు నగరాల్లో ఉన్న ప్రముఖ టుస్సాడ్ మ్యూజియంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ నటీనటుల విగ్రహాలు ఆవిష్కరించారు. అందులో బ్యాంకాక్ మ్యూజియంలో రెబల్‌స్టార్ ప్రభాస్, సింగపూర్‌లోని మ్యూజియంలో ప్రిన్స్ మహేశ్ బాబు విగ్రహాలు ఆవిష్కరించారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు సైతం ఈ గౌరవం దక్కింది. సింగపూర్‌లోని టుస్సాడ్ మ్యూజియంలో 2020లో కాజల్ విగ్రహావిష్కరణ జరిగింది. కాగా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ గౌరవం దక్కిన తొలి నటిగా కాజల్ రికార్డు కొట్టింది.