ETV Bharat / offbeat

నోరూరించే కమ్మని "మసాలా మిర్చి ఫ్రై" - వేడివేడి అన్నంలో అమృతమే! - MASALA MIRCHI CURRY

- అన్నం, చపాతీల్లోకి సూపర్ కాంబో - ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు!

HOW TO MAKE MIRCHI MASALA FRY
Masala Mirchi Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2025, 1:58 PM IST

Masala Mirchi Curry in Telugu : సాయం కాలం చాలా మంది ఇష్టంగా తినే స్నాక్ రెసిపీల్లో మిర్చి బజ్జీ ముందు వరుసలో ఉంటుంది. అయితే, బజ్జీ మిరపకాయలతో కేవలం బజ్జీలు మాత్రమే కాదు ఎన్నో రకాల వంటలూ చేసుకోవచ్చు. అందులో ఒకటే "మసాలా మిర్చి ఫ్రై". ఈసారి బజ్జీ మిర్చి తెచ్చినప్పుడు దీన్ని ట్రై చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నేరుగా కలుపుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతం! పప్పు, సాంబార్ వంటి వాటిల్లోకి సైడ్​ డిష్​గానూ అద్దిరిపోతుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు. మరి, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బజ్జీ మిరపకాయలు - 4
  • జీలకర్ర - 1 చెంచా
  • సోంపు - 1 చెంచా
  • మిరియాలు - కొన్ని
  • ఉల్లిపాయ - 1
  • పసుపు - పావు చెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - తగినంత
  • చింతపండు - కొద్దిగా
  • వేయించిన జీలకర్ర పొడి - 1 చెంచా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నూనె - ఫ్రైకి తగినంత
  • మెంతులు - 1 టీస్పూన్
  • ఆవాలు - 1 టీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొబ్బరి పాలు - కొన్ని
  • గరంమసాలా - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత చాకు సహాయంతో వన్​సైడ్ చీల్చుకొని అందులోని గింజలను తీసేసుకోవాలి. ఒకవేళ స్పైసీగా తినాలనుకునేవారు గింజలను ఉంచినా పర్లేదు. ఇలా అన్ని మిరపకాయలను ప్రిపేర్​ చేసుకోవాలి. అలాగే, ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని జీలకర్ర, సోంపు, మిరియాలను దోరగా వేయించుకోవాలి. అనంతరం వాటిని మిక్సీ జార్​లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర పొడి, చింతపండు వేసుకొని మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్​లోకి తీసుకొని కొత్తిమీర తరుగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు చీల్చి పక్కన పెట్టుకున్న మిరపకాయలను తీసుకొని మసాలా మిశ్రమాన్ని వాటిల్లో చక్కగా స్టఫ్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక మెంతులు, ఆవాలు, కరివేపాకు, మిగిలిన మసాలా స్టఫింగ్ వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • ఆపై కొబ్బరిపాలు యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టఫ్ చేసుకున్న మిర్చీలను వేసుకొని వాటిపై కాస్త గరంమసాలా చల్లి మూతపెట్టుకోవాలి.
  • అనంతరం మీడియం ఫ్లేమ్ మీద మిర్చీలు ఆ మిశ్రమంలో చక్కగా ఉడికేంత వరకు కుక్ చేసుకొని దింపేసుకుంటే చాలు. అంతే, టేస్టీ అండ్ స్పైసీ "మసాలా మిర్చి ఫ్రై" రెడీ!

ఇవీ చదవండి :

వంటసోడా లేకుండా అద్దిరిపోయే "అరటికాయ బజ్జీలు" - ఇలా చేస్తే నూనెె తక్కువ, రుచి ఎక్కువ!

రోడ్ సైడ్ బండి రుచితో మిర్చీ బజ్జీ కావాలా? - ఈ టిప్స్ పాటిస్తే అద్దిరిపోయే టేస్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.