Pushpa 2 Peeling Song :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'పుష్ప 2' నుంచి మరో సాంగ్ రిలీజైంది. ఇప్పటికే 'సూసేసి', 'కిస్సిక్' పాటలు హుషారెత్తిస్తుండగా తాజాగా 'పీలింగ్స్' సాంగ్ విడుదలైంది. ఈ పాట మలయాళం లిరిక్స్‌తో ప్రారంభమవడం విశేషం. మలయాళ అభిమానులపై ప్రేమతో ఇలా క్రియేట్ చేశామని అల్లు అర్జున్ ఓ ఈవెంట్‌లో తెలిపారు. ఈ సాంగ్ లిరిక్స్ చంద్రబోస్ రాయగా, సింగర్లు శంకర్ బాబు కందుకూరి, లక్ష్మి ఆలపించారు. పాటలో బన్నీ, రష్మిక డ్యాన్స్‌తో హుషారెత్తించారు. బన్నీ డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక పాట రిలీజైన తొలి గంటలోనే 1 మిలియన్ వ్యూస్ దాటేసింది.
కాగా, ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు, అర్ధరాత్రి 1.00 గంటలకు బెనిఫిట్ షోలు పడనున్నాయి. శనివారమే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఇక ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి, నవీన్ సంయుక్తంగా నిర్మించారు.
టికెట్ ధరల పెంపు
'పుష్ప 2' సినిమా టికెట్ ధరలు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ.800 పెంచుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ఇప్పుడున్న ధరకు అదననంగా రూ.800 చెల్లించాల్సిందే. అంటే బెనిఫిట్ షోకు టికెట్ ధర సింగిల్ స్క్రీన్స్‌లో సుమారు రూ. 1000, మల్టీప్లెక్స్‌లలో రూ.1200 పైగా అవుతోంది.