Allu Arjun Pushpa 2 Fans Reactions :బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన పుష్ప 2 థియేటర్లలోకి రానే వచ్చింది. గత కొద్ది రోజులుగా ఎటు చూసినా, ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. భారీ అంచనాలతోనే వచ్చిన ఈ చిత్రం పుష్ప ర్యాంపేజ్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్, డ్యాన్స్‌లు ప్రేక్షకుల్లో జోష్ నింపుతున్నాయి.
ముఖ్యంగా జాతర ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని అభిమానులు అంటున్నారు. గంగమ్మతల్లి అవతారంలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపంతో గూస్‌బంప్స్ తెప్పించారని అంటున్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు. అంతే కాకుండా ఐకాన్ స్టార్ తన యాక్టింగ్‌తో సినిమా రేంజ్ పెంచేశారంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసిస్తున్నారు.
సంధ్యలో బన్నీ ఫ్యామిలీ
మరోవైపు అల్లు అర్జున్ 'పుష్ప 2' చూసేందుకు హైదరాబాద్ సంధ్య థియేటర్‌కు వచ్చారు. తన ఫ్యామిలీ అలాగే ఫ్యాన్స్‌తో కలిసి ఈ సినిమా చూశారు. ఇక జాతర ఎపిసోడ్ సమయంలో ఆడియన్స్ బన్నీకి సలాం కొట్టగా, దానికి అల్లు అర్జున్ విజయోత్సహంతో తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఈ మూమెంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.