Allu Arjun Donates Wayanad Tragedy:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మంచితనాన్ని చాటుకున్నారు. కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన బాధితులకు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం తనవంతుగా రూ. 25లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన అఫీషియల్ సోషల్ మీడియా నుంచి పోస్ట్ షేర్ చేశారు.
'ఇటీవల వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన పట్ల నేను చాలా బాధపడ్డాను. కేరళ ఎల్లప్పుడూ నాపై ప్రేమ చూపించింది. నా వంతు కృషిగా రూ.25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి' అని ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో అల్ల అర్జున్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 'మీరు నిజమైన హీరో' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఇప్పటికే వయనాడ్ బాధితులకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు విరాళం ప్రకటించారు. టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూ.5 లక్షలు ఇవ్వగా, తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్- నయనతార దంపతులు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు. అంతకుముందు విక్రమ్ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి రూ.50 లక్షలను అందించారు.