తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గ్యాప్ ఇవ్వకుండా 'పుష్ప' ప్రమోషన్స్ - ఇప్పుడు కొచ్చి, నెక్స్ట్​ గోవా! - ALLU ARJUN GOA FILM FESTIVAL

కొచ్చి ఈవెంట్ తర్వత గోవాకు 'పుష్ప' టీమ్ ఎందుకంటే?

Allu Arjun
Allu Arjun (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 7:40 PM IST

Allu Arjun Goa Film Festival : ప్రస్తుతం దేశమంతటా 'పుష్ఫ 2' మేనియా నడుస్తోంది. ఇటీవలే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెంచేసింది. అంతేకాకుండా తాజాగా విడుదలైన 'కిసిక్' సాంగ్​తో ఎక్కడ చూసిన పుష్ప పేరే వినిపిస్తోంది. దీనికి తగ్గట్లుగానే మూవీ టీమ్​ కూడా ప్రమోషనల్ ఈవెంట్స్​లో యాక్టివ్​గా పాల్గొంటూ సందడి చేస్తోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్​ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ తన తమిళ స్పీచ్​తో అక్కడివారి ఫిదా చేశారు. దీంతో తమిళనాట కూడా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ బాగానే ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, బన్నీ తన టీమ్​తో పాటు మిగతా ప్రమోషనల్ ఈవెంట్స్​లో బిజీ బిజీగా ఉన్నారు. బుధవారం కొచ్చి వేదికగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఈవెంట్‌లో అభిమానులు, మీడియాతో సమావేశం కానున్నారు. దీంతో పాటు గురువారం గోవాలో జరుగుతున్న 55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ముగింపు వేడుకకు అల్లు అర్జున్ హాజరుకానున్నారట. రష్మికతో కలిసి అక్కడి రెడ్​ కార్పెట్​పై మెరవనున్నారట. ఇలా గ్యాప్​ ఇవ్వకుండా అన్నీ ఈవెంట్లకు వెళ్లి బన్నీ తమ మూవీని ప్రమోట్ చేయడం ఫ్యాన్స్​లో జోష్ పెంచుతోంది. ఇక ఇదే ఎనర్జీతో నవంబర్ 29న ముంబయి ఈవెంట్‌ని, నవంబర్ 30న బెంగళూరుకు వెళ్లనున్నారు అల్లు అర్జున్.

ఇక 'పుష్ప 2' సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నేషనల్ క్రష్​ రష్మిక మందన్నా ఈ చిత్రంలో శ్రీ వల్లి అనే పాత్రలో మెరుస్తుండగా, మాలీవుడ్​ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ భన్వర్​లాల్ షెకావత్​గా అలాగే సీనియర్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్​లు స్ట్రాంగ్​ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మూడు పాటలు చాట్​బస్టర్లుగా నిలిచి నెట్టింట ట్రెండ్​ అవుతున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై రవి శంకర్, నవీన్ ఈ సినిమాకు సంయుక్తంగా ప్రోడ్యూస్ చేశారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

'శ్రీలీల వల్ల జీవితంలో తొలిసారి అలా చేయాల్సి వచ్చింది!' : అల్లు అర్జున్​

బన్నీకి రష్మిక స్పెషల్ గిఫ్ట్ - ఇస్తే లక్ ఖాయం!

ABOUT THE AUTHOR

...view details