తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అకీరా న్యూ లుక్​ సూపర్ - ట్రెండ్ మొదలెట్టేశాడు! - akira new look viral

Akira New Look : అకీరాకు సంబంధించి తాజాగా నటి రేణూ దేశాయ్ ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. దాని గురించి ఈ కథనం.

అకీరా న్యూ లుక్​ సూపర్ - ట్రెండ్ మొదలెట్టేశాడు!
అకీరా న్యూ లుక్​ సూపర్ - ట్రెండ్ మొదలెట్టేశాడు!

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 5:52 PM IST

Updated : Feb 24, 2024, 6:35 PM IST

Akira New Look : నటి రేణు దేశాయ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్​గా ఉంటూ ఏదో ఒక పోస్ట్​ను ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా తన పిల్లల అకీరా, ఆద్యకు సంబంధించిన విషయాలనే పంచుకుంటుంది. అదే సమయంలో ఈ ఇద్దరు పెద్దవాళ్లు అవుతుండడంతో సోషల్ మీడియాలో వారిపై ఫోకస్ మరింత ఎక్కువగా అవుతోంది. వారికి సంబంధించి ప్రతి చిన్న విషయం ఇట్టే వైరల్ అయిపోతుంది.

అలా తాజాగా అకీరాకు సంబంధించి రేణు పెట్టిన ఓ పోస్ట్​ నెట్టింట్లో వైరల్ అవ్వడం మొదలైంది. ఇందులో అకీరా బిస్కెట్ కలర్​ ప్యాంటు, ఎర్ర చొక్కా వేసుకుని ఎంతో నేచురల్​గా సింపుల్​గా కనిపించాడు. చెప్పులు కూడా తన తండ్రి పవన్ ధరించే లాంటివే వేసుకున్నాడు. మొత్తంగా తన తండ్రి పోలికలతో వింటేజ్ పవన్​ను మరోసారి గుర్తుచేశాడు. అదే సమయంలో అతడు వైర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటం మరో విశేషం. ఇప్పుడందరూ బ్లూటూత్​ వినియోగిస్తుంటే అతడు మాత్రం ఓల్డ్ వైర్ ఇయర్ ఫోన్స్​ పెట్టుకుని కనిపించాడు. ​ ఈ ఫొటోనే ప్రస్తుతం నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు దాన్ని తెగ షేర్ చేస్తున్నారు. అకీర పాత ట్రెండ్​ను కొత్త ట్రెండ్​గా మారుస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఈ పిక్​ను షేర్ చేసిన నటి రేణూ తన పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఈ పోస్ట్​ ద్వారా అర్థమయ్యేలా చేసింది. అకీరా, ఆద్యాను ఓల్డ్​ వైర్​ ఇయర్ ఫోన్స్ మాత్రమే వాడాలని సూచిస్తున్నాను. ఎందుకంటే బ్లూటూత్​ వాడటం వల్ల మెదడు, చెవులుపై ఏదైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అకీరా స్లోగా ఫ్యాన్సీ హెడ్​ ఫోన్స్​ను వాడటం తగ్గించేసి ఈ వైర్ ఇయర్ ఫోన్స్​ వాడటం నాకు సంతోషంగా ఉంది అంటూ రాసుకొచ్చింది.

కాగా, అకీరా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. అతడు ప్రస్తుతం మ్యూజిక్​పై ఎక్కువ దృష్టి పెట్టాడు. అతడి ఆసక్తి కూడా దానిపైనే ఎక్కువగా ఉన్నట్లు పలుసార్లు రేణూ చెప్పుకొచ్చింది.

వరుణ్ తేజ్ - లావణ్య ప్రత్యేక పూజలు చేసింది అందుకోసమేనా?

షారుక్​ ఖాన్ పాటతో నవ్వులు పూయించిన అల్లు అయాన్ - ఇప్పుడీ వీడియోనే ట్రెండింగ్!

Last Updated : Feb 24, 2024, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details