Ram Charan Game Changer Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. అయితే తాజాగా మేకర్స్ అభిమానలకు ఓ షాకిచ్చారు. ఈ సినిమాలో చిన్న మార్పు చేసినట్లు వెల్లడించారు. ఇందులోని 'నానా హైరానా' పాటను తొలగించినట్లు తెలిపారు. జనవరి 14 నుంచి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.
ఏం జరిగిందంటే?
'గేమ్ ఛేంజర్'లోని 'నానా హైరానా' పాటకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. రిలీజవ్వక ముందు నుంచే ఈ ట్యూన్ అభిమానుల నోళ్లలో నానుతూ వచ్చింది. విజువల్స్ అలాగే మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకున్న ఈ సినిమా రూ.కోట్లలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అయితే కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా ఈ పాటను ప్రస్తుతం థియేటర్ ప్రింట్లో యాడ్ చేయనట్లు టీమ్ ప్రకటించింది. దీంతో చెర్రీ అభిమానులు, అలాగే మ్యూజిక్ లవర్స్ షాక్‌కు గురవుతున్నారు.
"అందరికీ ఎంతో ఇష్టమైన 'నానా హైరానా' సాంగ్‌ను ఇన్‌ఫ్రారెడ్ ఇమేజ్‌ల ప్రాసెసింగ్‌తో తెరకెక్కించాం. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో కారణంగా ప్రస్తుతం దీన్ని థియేటర్లలో వేయలేకపోయాం. త్వరలోనే ఈ ఇష్యూను సాల్వ్ చేస్తాం. జనవరి 14 నుంచి ఈ పాటను సినిమాలో యాడ్ చేస్తాం. అందుకోసం మా టీమ్ అంతా రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తోంది" అని మూవీ టీమ్ తెలిపింది.
ఒక్క పాటకు రూ. 10 కోట్లు!
అయితే 'గేమ్ ఛేంజర్' బడ్జెట్ సుమారు రూ.400 కోట్లు అయితే అందులో రూ.75 కోట్లను కేవలం పాటలకే ఖర్చు చేసినట్లుగా సినీ వర్గాల సమాచారం. ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఫస్ట్ ఇండియన్ సాంగ్ కూడా 'నానా హైరానా' కావడం విశేషం. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. తమన్ చక్కటి బాణీలను కట్టారు. న్యూజిలాండ్‌లో సుమారు 6 రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరిగింది.
ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు- ఇట్స్ రామ్‌చరణ్ టైమ్- రెండోసారైనా?
బాబాయ్ గురించి అబ్బాయ్ కామెంట్స్ - నెట్టింట వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్! చూశారా ?