Ajith Car Accident :కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. దుబాయ్ గ్రాండ్ ప్రిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన, రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కారు గోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో ట్రాక్ పై గిర్రున తిరిగి ముందు భాగం డ్యామేజ్ అయింది. భద్రత సిబ్బంది తక్షణమే స్పందించి ఆయన వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత తనను వేరే కారులో తరలించారు. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డప్పటికీ అజిత్‌కు స్వల్పంగా గాయమైనట్టు తెలుస్తోంది.
కొత్త రేసింగ్ టీమ్!
అయితే అజిత్‌కు రేసింగ్ అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగుల నుంచి బ్రేక్ దొరికితే చాలు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి మిగతా సమయాన్ని బైక్స్, కార్లతో చక్కర్లు కొడుతుంటూ కనిపిస్తుంటారు. కొన్ని నెలల క్రితం గంటకు 234 కిలోమీటర్ల వేగంతో ఆయన కారును డ్రైవ్ చేశారు. ఆ వీడియో అప్పట్లోనే తెగ వైరల్ అయింది. మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కూడా అజిత్ ఓ స్టార్టప్‌ను గతంలోనే ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకూ బైక్‌పై వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇదే కాకుండా తాజాగా తన రేసింగ్ టీమ్‌ను ప్రకటించారు. 'అజిత్ కుమార్ రేసింగ్' అనే పేరుతో టీమ్‌ను ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు అజిత్ మేనేజర్ సురేశ్ చంద్ర తాజాగా వెల్లడించారు.