Keerthy Suresh Wedding :కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీని క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు. ఆదివారం గోవాలోని ఓ హోటల్లో వీరి వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. కీర్తి వైట్ కలర్ గౌనులో మెరిసిపోగా, ఆంటోనీ స్యూట్‌లో కనిపించారు. ఈ ఫొటోలను కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్యాన్స్ ఈ కపుల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ఈనెల 12న గోవాలో కీర్తి, ఆంటోనీ పెళ్లి బంధువులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయంలో జరిగింది.
క్రిస్టియన్ పద్ధతిలో కీర్తి పెళ్లి- క్యూట్ కపుల్ ఫొటోలు చూశారా? - KEERTHY SURESH WEDDING
క్రిస్టియన్ పద్ధతిలో కీర్తి పెళ్లి- హాజరైన కోలీవుడ్ ప్రముఖులు!
Published : 6 hours ago
కీర్తి సురేశ్, ఆంటోనీ దాదాపు 15 ఏళ్ల నుంచి స్నేహితులు. ఇదే విషయాన్ని ఇటీవల ఆమె అధికారికంగా చెప్పారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని కీర్తి తెలిపారు. ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో వ్యాపారాలున్నాయి. స్కూల్ రోజుల నుంచే కీర్తితో ఆయనకు పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
ఇక కీర్తి సినిమాల విషయానికొస్తే, 'గీతాంజలి' అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసిన కీర్తి 'నేను శైలజ', 'మహానటి' లాంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. అయితే రీసెంట్గా ఆమె నటించిన 'రఘు తాత' మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమె 'రివాల్వర్ రీటా', 'బేబీ జాన్' అనే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. 'బేబీ జాన్' సినిమాతోనే కీర్తి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈనెల 25న ఈ సినిమా విడుదల కానుంది.