ETV Bharat / lifestyle

పిల్లలకు 'మేకప్' వేస్తున్నారా? - అయితే, ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే! - MAKEUP PRECAUTIONS FOR KIDS

చిన్నారులకు మేకప్ వేసే ముందు - ఈ జాగ్రతలు తప్పనిసరి అంటున్న నిపుణులు!

SAFE MAKEUP FOR Kids
Makeup Precautions for Children (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2025, 5:14 PM IST

Makeup Precautions for Children : మేకప్‌ అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం మక్కువతోనే కాదు, వృత్తిలో భాగంగానూ కొందరు తరచూ మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫంక్షన్స్, పార్టీలు, శుభకార్యాల సమయంలో మహిళలు మేకప్ వేసుకుంటుంటారు. అయితే, అలాంటి సందర్భాల్లో ఇంట్లోని పిల్లలూ తమకి మేకప్ కావాలని మారాం చేస్తుంటారు. దాంతో వాళ్ల గోల భరించలేక చిన్నారులకు మేకప్ వేసేస్తుంటారు. కానీ, అసలు సమస్య వచ్చేసరికి మేకప్​లోని రసాయనాలతో పిల్లలకేమైనా ఇబ్బంది అవుతుందేమోనని భయపడుతుంటారు అమ్మలు. మరి, మేకప్ చిన్నారులకు ఎంత వరకు మంచిది? ఒకవేళ వేసినా పిల్లలకు వాడే వాటిలో ఏమేం చూసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత రోజుల్లో పిల్లలకీ మేకప్‌ మీద అవగాహన బాగా పెరుగుతోంది. మారాం చేస్తున్నారని అమ్మలూ వేసేస్తున్నారు. సోషల్‌మీడియా, తోటివారి ప్రభావం కూడా ఎక్కువే. కానీ, ఇవి వారిలో తలనొప్పి, త్వరగా నెలసరి రావడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటివాటికి కారణమవుతాయంటున్నారు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శైలజ సూరపనేని. అందుకే చిన్నారులకు వేసే మేకప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.

చాలా మంది తల్లులు నేచురల్‌, ఆర్గానిక్‌ వంటి వాటితో అంతగా ఇబ్బంది ఉండదని తెగ వాడేస్తుంటారు. కానీ, వాటికి కొలమానమేమీ లేదు. అందుకే, మోసపోవద్దంటున్నారు. అయితే, శాస్త్రీయ నృత్యం, స్కూలు ప్రోగ్రాముల్లో నాటకాలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనేమో తప్పక వేయాల్సిన పరిస్థితి. అలాంటి సందర్భాల్లో మాత్రం తయారీలో తక్కువ పదార్థాలు ఉన్నవీ, మైల్డ్​వీ, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్ శైలజ సూరపనేని. అలాగే, మంచి బ్రాండ్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు.

ఫస్ట్​టైమ్​ మేకప్​ ట్రై చేస్తున్నారా? ఈ టిప్స్​ పాటించండి - సూపర్ బ్యూటీ మీ సొంతం!

తొలగింపుపై అశ్రద్ధ వద్దు!

ఒకవేళ అలాంటి సందర్భాల్లో పిల్లలకు మేకప్ వేసినప్పుడు తుడిచేయడంపైనా శ్రద్ధపెట్టాలి. పడుకున్నారనో మరొకటనో అశ్రద్ధ చేయొద్దంటున్నారు. కొందరు సంవత్సరాలపాటు కాస్మెటిక్స్‌ వాడుతుంటారు. అలాంటివి పిల్లలపై మరింత చెడు ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోవాలి. కొని ఆరు నెలలకు మించినవాటిని తుది గడువు ఉన్నా వాడొద్దని చెబుతున్నారు. మిగతా సందర్భాల్లోనైనా పిల్లలు మారాం చేశారని ఫౌండేషన్‌ దగ్గర్నుంచి రాయాలనేం లేదు. అంతకు గోల ఆపకుంటే లిప్‌గ్లాస్‌ పూయండి. అదే మేకప్‌ అని చెప్పాలి. లేదంటే ఫౌండేషన్‌ పౌడర్‌ వరకూ యూజ్ చేయొచ్చు. వీటినైనా ముందు వాళ్ల చర్మంపై పరీక్షించాల్సిందే అని గుర్తుంచుకోవాలి. అలాగే అప్లై చేసినప్పుడు దద్దుర్లు, ఎర్రబడటం వంటివి కనిపిస్తే వెంటనే కడిగేయాలంటున్నారు సౌందర్య నిపుణులు డాక్టర్ శైలజ.

ఇవి అసలు పెట్టొద్దు :

పిల్లలకు ఐలైనర్, మస్కారా, లిప్‌స్టిక్‌ వంటివి అసలు పెట్టొద్దని సూచిస్తున్నారు. అలాగే, సెన్సిటివ్‌ స్కిన్, ఎగ్జిమా వంటివి ఉన్నా మేకప్‌ వేయకూడదని చెబుతున్నారు. ప్రత్యేక సందర్భాల వరకూ వేసినా అది కూడా రిస్కే. అందుకే, పిల్లలు మారాం చేశారని డైలీ, ప్రతి వేడుకకీ వేసుకుంటూ వెళ్లొద్దని సూచిస్తున్నారు. అది మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. వీలైనంతవరకూ పిల్లలను మేకప్​కి దూరంగా ఉంచడమే బెటర్ అంటున్నారు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శైలజ సూరపనేని.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

లిప్​స్టిక్ ఎక్కువ సేపు ఉండట్లేదా? - ఈ టిప్స్ పాటించండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.