Sreeleela Favourite Role :టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో కొన్నేళ్లుగా బిజీ బిజీగా ఉంటోంది. చిన్న వయసులోనే ఆమె స్టార్ హీరోల మూవీల్లో అవకాశాలు అందుకుంది. చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'గుంటూరు కారం'లో అలరించింది. ఇప్పుడు ఆమె చేతిలో కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంతకీ కొంత కాలంలోనే భారీ హిట్‌లు అందుకున్న శ్రీలీల ఫేవరెట్ రోల్ (Favourite Role) ఏంటో తెలుసా?
ఫేవరెట్ రోల్ ఏంటి?
ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా శీలీల అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ని పలకరిస్తుంటుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ( Q & A) సెషన్ నిర్వహించింది. ఇందులో ఫాలోవర్స్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒకరు ఆమెను ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రల్లో ఫేవరెట్ ఏదని అడిగారు? ఇందుకు శ్రీలీల నేరుగా సమాధానం చెప్పకపోయినా, గత సంవత్సరం రిలీజ్ అయిన 'భగవంత్ కేసరి (Bhagavanth Kesari)' షూటింగ్ స్పాట్లో ఉన్నప్పటి ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ సినిమాలో ఆమె పోషించిన 'విజ్జి పాప' పాత్రే శ్రీలలకు ఫేవరెట్ అయ్యుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఉత్తమ తెలుగు చిత్రం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ భారీగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో విజ్జీ పాప పాత్రలో శ్రీలీల యాక్టింగ్, డ్యాన్స్‌తో పాటు ఫైట్‌లకు కూడా మంచి పేరు వచ్చింది. ఇటీవల SIIMA 2024లో భగవంత్ కేసరి, ఉత్తమ చిత్రం (తెలుగు) అవార్డు అందుకుంది.