Actors Who Left Government Jobs For Movies:ఒకప్పటి నుంచి ఇప్పటి కాలం వరకు ఎంతో మంది తమ కలలను నెరవేర్చుకునేందుకు ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్ వైపుకు అడుగులేస్తుంటారు. అందులో డాక్టర్, ఇంజనీర్, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా వేర్వేరు రంగాలకు చెందిన వారూ ఉంటారు. అయితే ఎంతో శ్రమించి సాధించిన అదే ఉద్యోగాన్ని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవల్సిందే అన్నట్లు సినిమా రంగంపై ఆసక్తి ఉన్న కొంతమంది హీరోలు తాము చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకుని ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక్కడా మంచి గుర్తింపు తెచ్చుకుని పెద్ద స్టార్లుగా ఎదిగారు. ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.
1. రజనీకాంత్:సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కప్పుడు బెంగుళూరు ట్రాన్స్ పోర్టు సర్వీసులో బస్ కండక్టర్‌గా పనిచేశారు. సినిమాల్లోకి రావాలన్న కోరికతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమనే శాసించే స్థాయికి ఎదిగారు. దేశ వ్యాప్తంగా రజనీకాంత్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రజనినీ ముద్దుగా అందరూ తలైవా అని పిలుస్తారు.
2. దిలీప్ కుమార్:తన నటనతో బాలీవుడ్‌ను శాసించిన స్టార్ హీరోల్లో దివంగత నటుడు దిలీప్ కుమార్ ఒకరు. సినిమాల్లోకి రాకముందు పుణెలో ఓ మిలటరీ క్యాంటీన్‌ను నడిపేవారు. బాలీవుడ్ నటి దేవికా రాణి అతన్ని గుర్తించి ఆయనకు నటించేందుకు అవకాశమిచ్చారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.
3. రాజ్ కుమార్:'మదర్ ఇండియా', 'తిరంగా' లాంటి సినిమాలతో బీటౌన్ ప్రేక్షకులకు సుపరిచితుడైన స్టార్ హీరో రాజ్ కుమార్ ముంబయిలో సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించేవారు. బాలీవుడ్ లో కెరీర్ ను కొనసాగించుకునేందుకు ఆ ఉద్యోగాన్ని వదిలేశారు.
4. శివాజీ సతమ్:శివాజీ సతమ్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. సీఐడీ సీరియల్లో ఏసీపీ ప్రధ్యుమ్న అంటే ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన విలక్షణ నటనతో బుల్లితెరపై రాణించిన ఈ స్టార్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పనిచేసేవారు. నటనపై ఉన్న ఆసక్తితో థియేటర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్‌లో మెరిశారు.
5. అమోల్ పాలేకర్:ఈయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగాన్ని వదిలి బాలీవుడ్ లో తన కెరీర్‌ను కొనసాగించాడు.