Dulquer Movie Remake Actor Rana:ఇప్పుడు సినిమాలను రీమేక్ చేయాల్సిన అవసరం లేదు. భారీ సినిమాలన్నీఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్నాయి. చిన్న చిత్రాల డబ్బింగ్ వెర్షన్‌లు ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి. కానీ గతంలో హిట్ అయిన సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేవారు. అయితే వాటి రీమేక్‌లు ఆలస్యమైనప్పుడు లేకుంటే తీయనప్పుడు ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే సినిమా చూసేవారు. ఇలా ఎక్కువ మంది చూసిన సినిమాల్లో 'బెంగళూరు డేస్' ఒకటి. అయితే ఈ సినిమా రీమేక్‌లో నటించి తప్పు చేశానంటూ హీరో రానా దగ్గుబాటి ఓ సందర్భంలో అన్నారు. అయితే ఆయన ఎందుకలా అన్నారంటే?
తమిళంలో 'బెంగళూరు నాట్కల్'
'బెంగళూరు డేస్' తమిళంలో 'బెంగళూరు నాట్కల్' అనే పేరుతో రీమేక్ అయింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అందులో ఫహాద్ ఫాజిల్ క్యారక్టెర్‌ని రానా చేశారు. ఈ విషయం గురించే ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'బెంగళూరు డేస్' తమిళ రీమేక్‌లో నేను యాక్ట్ చేశాను. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అంత అందమైన సినిమాని రీమేక్ చేయడమనేది సరైన ఆలోచన కాదు. కేవలం ఫహాద్ పాత్ర పోషించాలనే ఆత్రుత వల్లే ఆ ప్రాజెక్ట్‌ని ఓకే చేశాను.' అని చెప్పారు.
'బెంగళూరు నాట్కల్'లో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య, బాబీ సింహా, శ్రీ దివ్య, ప్రకాశ్ రాజ్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ పాత్రను ఆర్య పోషించగా, నివిన్ పౌలీ రోల్‌లో బాబీ సింహా యాక్ట్ చేశారు. ఇక నజ్రియాలా శ్రీ దివ్య కనిపించగా, ఇందులో సమంత రూత్ ప్రభు ఓ అతిథి పాత్రలో మెరిశారు. రానా కూడా ఈ సినిమాలో కీ రో ప్లే చేశారు.