తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రజనీకాంత్ హెల్త్ అప్డేట్- ఆసుపత్రి నుంచి తలైవా డిశ్చార్జి - Rajinikanth Health Update - RAJINIKANTH HEALTH UPDATE

Rajinikanth Health Update : అనారోగ్యం కారణంగా ఇటీవల చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జి అయ్యారు.

Rajinikanth Health Update
Rajinikanth Health Update (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 9:30 AM IST

Rajinikanth Health Update :అనారోగ్యం కారణంగా ఇటీవల చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జి అయ్యారు. ఆయన గురువారం రాత్రి 11 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన రజనీ, కారులో నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటికి వెళ్లారు.

అయితే రజనీకాంత్ స్టెపంబర్ 30 సోమవారం అనారోగ్యం కారణంగా చెన్నై ఆసుపత్రిలో చేరారు. ఆయన గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడిందని, దానికి ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చినట్టు అక్టోబర్ 1న డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ సహా, సినీఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షించారు. కాగా, మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షనలో ఉన్న రజనీ తాజాగా డిశ్చార్జి అయ్యారు.

షూటింగ్​కు అప్పట్నుంచే

అయితే పూర్తిగా కోలుకున్న తర్వాత రజనీ మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొననున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉండడం వల్ల, ఆయన మూడు వారాల తర్వాత చిత్రీకరణకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇలోగా మిగిలిన నటీనటులపై సన్నివేశాలు చేయనున్నారు. ఈ చిత్రంలో రజనీతోపాటు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Rajinikanth Vettaiayan Movie : కాగా, ఆయన హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'వేట్టయాన్‌' అక్టోబర్‌ 10న విడుదల కానుంది. రీసెంట్​గా ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదలైంది. ఇందులో ఆయన పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ ఆఫీసర్​గా నటిస్తున్నారు. సినిమాలో విలన్‌గా రానా దగ్గుబాటి కనిపిస్తారని అంటున్నారు. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి.జ్ఞాన్​వేల్ దర్శకత్వం వహించారు.

రజనీకాంత్​ 'వేట్టాయన్'పై కోర్టులో కేసు - ఎందుకంటే? - Vettaiyan Movie Court Case

రజనీ ఆరోగ్యంపై ప్రధాని ఆరా - 'త్వరగా ఇంటికి తిరిగి రావాలంటూ ప్రార్థించాను' - Rajini Health Update

ABOUT THE AUTHOR

...view details