తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

2 నెలల్లో 7యాక్షన్ మూవీస్- లిస్ట్​లో 'పుష్ప', 'కంగువా'- బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా!

రెండు నెలల్లో 7 భారీ యాక్షన్ సినిమాలు- బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవడం ఖాయం!

2024 Upcoming Movies
2024 Upcoming Movies (Source: ETV Bharat, Getty Images (Right))

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

2024 Upcoming Movies :2024లో మరో రెండు నెలలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ రెండు నెలల్లో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుంచి భారీ యాక్షన్​ సినిమాలు రిలీజ్​ కానున్నాయి. ఈ సినిమాలపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో అల్లు అర్జున్ 'పుష్ప- 2', సూర్య 'కంగువా', అజయ్ దేవగణ్ 'సింగం అగైన్' సహా పలు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇవి ఇండియన్ బాక్సాఫీస్​తోపాటు వరల్డ్​వైడ్​గా పలు రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం!

పుష్ప-2 :అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప 2'. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుష్పకు సీక్వెల్‌గా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచస్థాయిలో పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

కంగువా :తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం 'కంగువా'. రెండు భాగాలుగా ఇది రానుంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్‌ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.

సింగం అగైన్ :తెరపై మరోసారి బాజీరావ్‌ సింగమ్‌ పాత్రలో తనదైన యాక్షన్‌ హంగామాతో ప్రేక్షకులను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన, అక్షయ్‌ కుమార్‌, రణ్​వీర్‌ సింగ్‌, టైగర్‌ ష్రాఫ్‌, కరీనా కపూర్‌, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సింగమ్‌ అగైన్‌'. రోహిత్‌ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబరు 1న దియేటర్లలో విడుదల కానుంది. భారీ తారాగణం ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దఎత్తున అంచనాలు ఉన్నాయి.

భూల్‌ భులయ్యా 3 :బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'భూల్‌ భులయ్యా 2' మంచి విజయాన్ని సాధించింది. దీంతో 'భూల్‌ భులయ్యా 3'తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది చిత్రబృందం. ఈ మూవీ కూడా దీపావళి కానుకగా నవంబరు 1న విడుదల కానుంది. అజయ్ దేవగణ్ మూవీ సింగం అగైన్ తో పోటీ పడనుంది.

బేబీ జాన్ :వరుణ్‌ ధావన్‌ హీరోగా రానున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎంటర్‌ టైనర్‌ 'బేబీ జాన్‌'’. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ చిత్రాన్ని కాలీస్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఛావా :మరాఠా రాజు శంభాజీ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ 'ఛావా'. ఇందులో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను లక్ష్ణణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ డిసెంబరు 6న విడుదల కానుంది.

క్రేవెన్ ద హంటర్ :ఆరోన్‌ టేలర్‌ నటించిన హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమా 'క్రేవెన్ ద హంటర్'. ‘ఈ సినిమా డిసెంబరు 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

TFIలోనే తొలి సినిమాగా రికార్డ్- ఇదీ 'పుష్ప రాజ్​' బ్రాండూ!

రాజమౌళి ఇన్​స్పిరేషన్​తో 'కంగువా' మూవీ! - అందుకే రెండేళ్లు పట్టింది : హీరో సూర్య

ABOUT THE AUTHOR

...view details