LIVE: ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు - హాజరైన సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్షప్రసారం - WORLD TELUGU FEDERATION LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jan 5, 2025, 7:06 PM IST
|Updated : Jan 5, 2025, 7:57 PM IST
WORLD TELUGU FEDERATION LIVE : హైదరాబాద్లోని హెచ్‌ఐసీసీలో వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సులో జనవరి 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కృష్ణ ఎల్ల, మురళీమోహన్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి, కంభంపాటి తదితరులు హాజరయ్యారు. మూడో రోజు తెలుగు మహాసభలు జరగుతున్నాయి. తెలుగు మహాసభలకు ఉదయం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ప్రారంభం అయినప్పటి నుంచి వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సినీకళాకారులు, సాహితీ వేత్తలు, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు 1992లో ప్రారంభమయ్యాయి. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ మహాసభల్లో తెలుగు భాష ప్రాముఖ్యత, సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్‌లో రెండోసారి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు ఇందిరాదత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Jan 5, 2025, 7:57 PM IST