Zomato Large Order Fleet : ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త సర్వీస్‌లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా మంగళవారం 'లార్జ్ ఆర్డర్ ఫ్లీట్' సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఓకేసారి 50 మంది వ్యక్తులకు సరిపడా భోజనాలను డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది. గ్రూప్ ఈవెంట్లు, పార్టీలు చేసుకునేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.
"భారతదేశంలోనే మొదటిసారిగా భారీ ఫుడ్ ఆర్డర్లను అందించడానికి "లార్జ్ ఆర్డర్ ఫ్లీట్"ను ప్రారంభిస్తున్నాం. ఈ ఆర్డర్లను డెలివరీ చేయడానికి 'ఆల్-ఎలక్ట్రిక్ ఫ్లీట్'ను ఉపయోగిస్తాం. దీని వల్ల కస్టమర్లకు మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది." -
జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ట్వీట్ (ఎక్స్)
ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో డెలివరీ
Zomato All Electric Fleet : జొమాటో ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేయడానికి ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతోంది. ఇంతకు ముందు సాధారణ ఆర్డర్లు ఇవ్వడానికి కూడా వీటినే వాడారు. తాజాగా వీటిని ఈ పెద్ద ఫుడ్ ఆర్డర్లు బట్వాడా చేయడానికి కూడా ఉపయోగించాలని నిర్ణయించారు. దీనిలో కూలింగ్ కంపార్ట్మెంట్లు, హాట్ బాక్స్‌లు రెండూ ఉంటాయి. కనుక ఫుడ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని జొమాటో తెలిపింది.