ETV Bharat / business

హోండా అమేజ్ నుంచి కియా సిరోస్ వరకు - డిసెంబర్​లో లాంఛ్​ కానున్న బెస్ట్ కార్స్ ఇవే!

అదిరిపోయే లుక్​, బెస్ట్ మైలేజ్​, స్టన్నింగ్ ఫీచర్స్​తో - 2024 డిసెంబర్​లో లాంఛ్ కానున్న హోండా, కియా, టయోటా కార్స్ ఇవే!

Honda Amaze  (Old Model)
Honda Amaze (Old Model) (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 6:25 PM IST

Car Launches In December 2024 : మీరు ఇయర్ ఎండింగ్​లో కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్​. 2024 డిసెంబర్​లో మూడు సరికొత్త కార్లు ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. అవి :

1. హోండా అమేజ్​

2. కియా సిరోజ్​

3. టయోటా కామ్రీ

మరెందుకు ఆలస్యం వీటి డిజైన్, ఫీచర్స్, స్పెక్స్​, ధర తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

1. Honda Amaze Facelift : హోండా కార్స్ ఇండియా కంపెనీ 2024 డిసెంబర్​ 4న ఇండియన్ మార్కెట్లోకి థర్డ్ జనరేషన్​ అమేజ్​ ఫేస్​లిఫ్ట్​ను లాంఛ్​ చేయనుంది. డిజైన్ పరంగా ఈ కాంపాక్ట్ సెడాన్​ కారులో అనేక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్​టీరియర్​తోపాటు, ఇంటీరియర్​లోనూ అనేక అప్​గ్రేడ్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ కారులో హోండా ఎలివేట్​ను పోలిన డ్యాష్​బోర్డ్ ఉంటుంది. సేఫ్టీపరంగా చూస్తే ఈ కారులో ADAS ఫీచర్​ను కూడా పొందుపరిచారు.

New Honda Amaze Features : ఈ హోండా అమేజ్​ కారు ముందు భాగంలో న్యూ హెడ్​లైట్స్​, బంపర్​ అమర్చారు. బోనెట్ మాత్రం ప్రస్తుత మోడల్​లో ఉన్నట్లుగానే ఉంది. ప్రస్తుత మోడల్ కంటే పెద్ద గ్రిల్​ను పెట్టారు. కారు లోపల కొత్త సాఫ్ట్​ టచ్​ మోటీరియల్స్ వాడారు. అలాగే రియర్​ ఏసీ వెంట్స్​ కూడా పెట్టారు. ఈ లేటెస్ట్ కారులో 8 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్ ఉంటుంది. అయితే దీనిలో 360 డిగ్రీ కెమెరా మాత్రం మిస్​ అయినట్లు తెలుస్తోంది.

ఈ లేటెస్ట్ అమేజ్​ కారులో 1.2 లీటర్​, ఫోర్​-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉండొవచ్చని, ఇది​ 89 బీహెచ్​పీ పవర్​, 110 ఎన్​ఎం టార్క్​ జనరేట్ చేస్తుందని తెలుస్తోంది. ఇది 5 స్పీడ్​ మాన్యువల్​, సీవీటీ ఆటోమేటిక్​ గేర్​బాక్స్​తో అనుసంధానమై పనిచేస్తుంది. హోండా కంపెనీ - ఇండియాలో డీజిల్ ఇంజిన్ కార్లను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. కనుక కొత్త అమేజ్ కారు కేవలం పెట్రోల్ వెర్షన్​లో లభించనుంది.

New Honda Amaze Price : ఈ న్యూ హోండా అమేజ్​ కారు ధర సుమారుగా రూ.7.29 లక్షల నుంచి రూ.10.05 లక్షల వరకు ఉంటుందని అంచనా.

2. Toyota Camry Facelift : టయోటా కిర్లోస్కర్​ మోటార్స్ 2024​ డిసెంబర్​ 11న భారత మార్కెట్లోకి నైన్త్ జనరేషన్​ కామ్రీ కారును లాంఛ్​ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టయోటాకు చెందిన ఈ ఫ్లాగ్​షిప్ కారు ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారులో కూడా ఎక్స్​టీరియర్, ఇంటీయర్​ మార్పులు చేశారు. అలాగే లేటెస్ట్ ఫీచర్లు అమర్చారు. ప్రస్తుతమున్న కామ్రీ కారులో 2.5 లీటర్ హైబ్రీడ్ ఇంజిన్ ఉంది. త్వరలో లాంఛ్ కానున్న మోడల్​లోనూ ఇదే ఇంజిన్ ఉండే అవకాశం ఉంది.

New Toyota Camry Features : ఈ టయోటా కామ్రీ కారు మంచి స్టైలిష్ లుక్​లో ఉంటుంది. ఈ కారులో 9 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్, అలాగే 7 అంగుళాల టీఎఫ్​టీ మల్టీ-ఇన్ఫర్మేషన్​ డిస్​ప్లే ఉంటాయి. ఈ లగ్జరీ కారులో 2.5 లీటర్​, ఫోర్ సిలిండర్​ ఇంజిన్​ అమర్చారు. ఇది 222 బీహెచ్​పీ పవర్​ జనరేట్ చేస్తుంది. ఇది eCVT గేర్​బాక్స్​తో అనుసంధానమై పనిచేస్తుంది. ప్రస్తుతమున్న వెర్షన్ లీటర్​కు​ 19 కి.మీ మైలేజ్ ఇస్తోంది. లేటెస్ట్ వెర్షన్ ఇంత కన్నా ఎక్కువ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.

New Toyota Camry Price : ఈ ప్రీమియం టయోటా కారు ధర బహుశా రూ.50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

3. Kia Syros : కియా కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి 2024 డిసెంబర్ 19న సిరోస్ కారును లాంఛ్ చేయనుంది. ఇప్పటికే ఈ లేటెస్ట్ కారు పలుమార్లు ఇండియన్ రోడ్లపై కనిపించింది. ఈ కార్​లో ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ లేటెస్ట్ మోడల్​లోని హెడ్​ల్యాంప్స్​, కార్నివాల్ ఎంపీవీని పోలి ఉంటాయని టాక్​. ఇక బంపర్స్​ సిల్వర్ ఫినిష్​తో వస్తాయని సమాచారం.

Kia Syros Features : ఈ కారులో కచ్చితంగా పనోరమిక్ సన్​రూఫ్​ ఉంటుంది. దీనితోపాటు క్లైమేట్ కంట్రోల్​ విత్ రియర్ వెంట్స్​, డ్యూయెల్ స్క్రీన్స్​ విత్​ వైర్​లెస్​ ఫోన్​ మిర్రరింగ్​, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్​ 1 ADAS ఉంటాయని అంచనా. ఈ కియా కారు 1.2 లీటర్​ ఎన్​ఏ పెట్రోల్, 1.0 లీటర్​ జీడీఐ టర్బో పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్ ఆప్షన్లలో వస్తుందని సమాచారం.

Kia Syros Price : ఈ కియా కారు ధర సుమారుగా రూ.6 లక్షలు - రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.