ValentineS Day Gifts :వాలంటైన్స్ డే రోజు ప్రేమికులు గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే మీ ప్రియురాలికి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 2000 మాత్రమేనా? మీ బడ్జెట్లో వచ్చే మార్కెట్లో దొరికే బెస్ట్ ఇయర్‌బడ్స్‌ను కానుకగా ఇవ్వండి. మరి అవి ఏంటో ఓ లుక్కేయండి.
1.Boult Audio Z40 True Earbuds Specifications :ఈ ఇయర్ బడ్స్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 60 గంటల ప్లే బ్యాక్ టైమ్ వస్తుంది. ఎక్కువ కాలం ఉపయోగించుకునేలా ఈ ఇయర్ బడ్స్‌ను డిజైన్ చేశారు. దీంతో పాటు ఈ ఇయర్ బడ్స్‌లో ఐపీఎక్స్5 రేటింగ్ ఉంటుంది. మీరు కాల్ మాట్లాడేటప్పుడు నాయిస్ లేకుండా చేసే ఫీచర్ ఈ ఇయర్ బడ్లో ఉంది.
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5.3
- వాటర్ రెసిస్టెన్స్ : IPX5
- డ్రైవర్స్ : 10MM బూమ్ ఎక్స్ టెక్
- గేమింగ్ : లో లేటెన్సీ
- ఛార్జర్ :టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్
Boult Audio Z40 True Earbuds Price : ఈ బోల్ట్ ఆడియో Z40 ట్రూ ఇయర్ బడ్స్ ధర మార్కెట్లో ప్రస్తుతం రూ. 1,199గా ఉంది.
2. Noise Buds VS104 Earbuds Specifications : నాయిస్ వీఎస్ 104 బడ్స్ పర్సనల్, ఫ్రొఫెషనల్‌గా ఉపయోగపడతాయి. వీటిలో క్వాడ్ మిక్స్ ఈఎన్సీ సెన్సర్ ఉండటం వల్ల వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. దీంతో పాటు వాటర్ రెసిస్టెన్స్ ఆప్షన్ కూడా ఉంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
- ప్లేటైమ్ : ఒక సారి ఛార్జ్ చేస్తే 45 గంటల పాటు ప్లే బ్యాక్ టైమ్ వస్తుంది.
- మైక్రోఫోన్ : Quad mics ENC
- ఛార్జింగ్ : ఇన్స్టాంట్ ఛార్జ్
- గేమింగ్ :లో లేటెన్సీ 50ఎఎస్ వరకు
- వాటర్ రెసిస్టెన్స్ : IPX5
- బ్లూటూత్ : v5.2
Noise Buds VS104 Earbuds Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ నాయిస్ ఇయర్ బడ్స్ వీఎస్ 104 ధర రూ. 1299గా ఉంది.
3.BoAt Nirvana Ion TWS Earbuds Specifications :తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో ఉండే ఇయర్ బడ్స్కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఇయర్ బడ్స్‌ను ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే 120 గంటల ప్లే బ్యాక్ టైమ్ ఉంటుంది. మంచి సౌండ్ ఫ్రొపైల్ ఆప్షన్ ఉంది.
- ప్లే బ్యాక్ :120 గంటలు
- సౌండ్ :క్రిస్టల్ బయోనిక్ డ్యూయల్ ఈక్యూ
- మైక్రోఫోన్ : క్వాడ్ మిక్స్ విత్ ఇఎన్ఎక్స్ టెక్నాలజీ
- గేమింగ్ :లో లేటెన్సీ
- వాటర్ రెసిస్టెన్స్ : IPX4
- కనెక్టివిటీ : బ్లూటూత్ వి5.2
BoAt Nirvana Ion TWS Earbuds Price :ప్రస్తుతం మార్కెట్లో ఈ నిర్వాన అయాన్ ఇయర్ బడ్స్ ధర రూ.1,799గా ఉంది.