Top Metal Credit Cards In India August 2024 :మన జీవితంలో అకస్మాత్తుగా అనేక ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే సాధారణ క్రెడిట్ కార్డులతో పోలిస్తే మెటల్ కార్డులు తక్కువ వడ్డీ రేటును విధిస్తాయి. అంతేకాదు హయ్యర్ రివార్డులు, ప్రత్యేకమైన డీల్స్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటి వార్షిక ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం దేశంలోని ప్రముఖ బ్యాంకులు అన్నీ మెటల్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వాటిలోని టాప్-7 మెటల్ క్రెడిట్ కార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. HDFC Infinia Metal Credit Card
- ఈ కార్డు ఉన్నవారు ఐటీసీ హోటళ్లలో రాత్రి వేళ ఫ్రీగా బస చేయొచ్చు. అలాగే బుఫే (buffet) తినొచ్చు.
- మొదటి సంవత్సరం కాంప్లిమెంటరీ క్లబ్ మారియట్ సభ్యత్వం లభిస్తుంది.
- అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అన్లిమిటెడ్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది.
- ఖర్చు చేసిన ప్రతి రూ.150కి 5 రివార్డ్ పాయింట్లు వస్తాయి.
- 24 X 7 గ్లోబల్ పర్సనల్ కాన్సియజ్
- హెచ్డీఎఫ్సీ ఇన్ఫియా మెటల్ కార్డ్ కావాలనుకునేవారు రూ.12,500 జాయినింగ్ ఫీజును కట్టాల్సి ఉంటుంది. అలాగే అదనంగా పన్నులు కట్టాల్సి ఉంటుంది. కార్డు యాక్టివేషన్ తర్వాత వెల్కమ్ ఆఫర్లు, కార్డు రెన్యూవల్ బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే హెచ్డీఎఫ్సీ ఇన్ఫియా మెటల్ క్రెడిట్ కార్డ్‌తో ఏడాది వ్యవధిలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే, వచ్చే ఏడాది ఫ్రీగా మెంబర్షిప్ రెన్యూవల్ అవుతుంది.
2. HDFC Biz Black Metal
- ఈ కార్డు తీసుకున్నవారికి వ్యాపార ఖర్చులపై 5X రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1000+ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు అపరిమిత యాక్సెస్
- యాక్టివ్ కార్డ్ హోల్డర్లకు మాత్రమే అపరిమిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.
- హెచ్డీఎఫ్సీ బిజ్ బ్లాక్ మెటల్ కార్డు సభ్యత్వ రుసుము రూ.10 వేల వరకు ఉంటుంది. అలాగే పన్నులు వర్తిస్తాయి. ఏడాదిలో ఈ కార్డుతో రూ.7.5 లక్షలు (12 బిల్లింగ్ సైకిల్స్) ఖర్చు చేస్తే, మరుసటి ఏడాది రెన్యువల్ ఫీజు ఉండదు. కార్డు తీసుకునేటప్పుడు కట్టిన ఫీజును తిరిగి రాబట్టేందుకు కార్డు జారీచేసిన 90 రోజుల్లో రూ.1.5 లక్షలు ఖర్చు చేసినా సరిపోతుంది.
3. IDFC First Private Credit Card
- ఈ కార్డుతో నెలకు రూ.30,000 కంటే ఎక్కువ ఖర్చు చేసేవారికి 6X, అద్దె కట్టేవారికి 3X రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
- నెలకు రూ.30,000 కంటే ఎక్కువ ఖర్చు చేసేవారికి 10X రివార్డు పాయింట్లు లభిస్తాయి.
- నెలకు రెండు సార్లు రూ.40,000 కంటే ఎక్కువ విలువైన కాంప్లిమెంటరీ గోల్ఫ్ రౌండ్లు లేదా లెస్సన్స్ లభిస్తాయి.
- మీ పుట్టినరోజునాడు చేసే ఖర్చులపై 10X రివార్డు పొందవచ్చు. అలాగే విరాళంగా ఇచ్చే డబ్బులపై 25శాతం బోనస్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
- దేశవిదేశాల్లోని విమానాశ్రయాల్లోని స్పాలు, లాంజ్‌లకు ఉచిత అపరిమిత యాక్సెస్ ఉంటుంది.