Astrologer Venu Swamy Publicly Apologizes to Telangana Women Commission : తెలంగాణ ఉమెన్ కమిషన్‌కి జ్యోతిష్యుడు వేణు స్వామిబహిరంగంగా క్షమాపణ చెప్పారు. నటుడు అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహ బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్‌కు బహిరంగ క్షమాపణలు కోరారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు రాతపూర్వకంగా లేఖను అందజేశారు. అసలేం జరిగిందంటే,
గతంలో నాగచైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని వేణు స్వామి జోష్యం చెప్పారు. ఇద్దరూ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పారు. వేణు స్వామి వ్యాఖ్యలపై తెలంగాణ ఉమెన్ కమిషన్‌కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై వేణు స్వామికి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరొకసారి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరైన ఆయన తన వ్యాఖ్యలను ఉపసరించుకున్నట్లు తెలిపారు. ఉమెన్ కమిషన్‌ను క్షమాపణ కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణుస్వామిని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శారద హెచ్చరించారు.