Stock Market Close :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, తరువాత తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను ప్రకటించనుంది. అందుకే మదుపరులు ముందు జాగ్రత్త చర్యగా ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల నుంచి లాభాలు స్వీకరించారు. అందుకే ఎర్లీ ట్రేడింగ్‌లో భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. అయితే మీడియా, రియాలిటీ షేర్లు మాత్రం లాభపడ్డాయి.
చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 23 పాయింట్లు లాభపడి 81,355 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 1.25 పాయింట్లు వృద్ధిచెంది 24,836 వద్ద ముగిసింది.
- లాభపడిన స్టాక్స్ : ఎల్ అండ్ టీ, బజాజ్ఫిన్సెర్వ్, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్
- నష్టపోయిన షేర్స్ : టైటాన్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్
అంతర్జాతీయ మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ అన్నీ లాభాలు మూటగట్టుకున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు మిక్స్డ్ ట్రెండ్‌లో నడుస్తున్నాయి.
ముడి చమురు ధర
Crude Oil Prices July 29, 2024 :అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.31 శాతం మేర తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80.88 డాలర్లుగా ఉంది.
Stock Market Today July 29th, 2024 :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 416 పాయింట్లు లాభపడి 81,749 వద్ద జీవన కాల గరిష్ఠాన్ని తాకింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 145 పాయింట్లు వృద్ధిచెంది 24,902 వద్ద లైఫ్ టైమ్ పీక్స్‌ను టచ్ చేసింది. విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 270 పాయింట్లు లాభపడి 81,602 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 67 పాయింట్లు వృద్ధిచెంది 24,920 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : టైటాన్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఏసియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే ఇండియా