Stock Market Close : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం మంచి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాల వద్ద స్థిరపడ్డాయి. ఫార్మా, ఆయిల్, గ్యాస్ స్టాక్స్ రాణించడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 80,664 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ 84 పాయింట్లు వృద్ధి చెంది 24,586 వద్ద ముగిసింది.
- లాభపడిన స్టాక్స్ :ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఐటీసీ, అదానీ పోర్ట్స్
- నష్టపోయిన షేర్స్ : ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్,
12.30 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 158 పాయింట్లు లాభపడి 80,666 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ 79 పాయింట్లు వృద్ధి చెంది 24,581 వద్ద ట్రేడవుతోంది.
Stock Market Today July 15, 2024 :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 95 పాయింట్లు వృద్ధిచెంది 24,598 వద్ద జీవన కాల గరిష్ఠాన్ని తాకింది. ఐటీ స్టాక్స్ రాణిస్తుండడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరుగుతుండడమే ఇందుకు కారణం. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్స్ ర్యాలీ కొనసాగుతుండడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలపరుస్తోంది.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 80,580 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ 45 పాయింట్లు వృద్ధి చెంది 24,547 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : హెచ్‌సీఎల్ టెక్, మారుతి సుజుకి, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సెర్వ్, హిందూస్థాన్ యూనిలివర్