10.30 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 863 పాయింట్లు లాభపడి 79,442 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 299 పాయింట్లు వృద్ధిచెంది 24,292 వద్ద ట్రేడవుతోంది.
Stock Market Today August 7, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1046 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్ల మేర లాభపడ్డాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 733 పాయింట్లు లాభపడి 79,336 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 244 పాయింట్లు వృద్ధిచెంది 24,237 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఐటీసీ, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, టైటాన్
అంతర్జాతీయ మార్కెట్లు
మంగళవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ అన్నీ మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) రూ.3,531 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIs) రూ.3,357 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.