RBI New Credit Card Rules 2024 : క్రెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త. ఆర్బీఐ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్రెడిట్ కార్డుల విషయంలో, తమకు నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకునే స్వేచ్ఛను వినియోగదారులకు ఇవ్వాలని ఆదేశించింది.
కోరుకున్న క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోవచ్చు!
ప్రస్తుతం 'కార్డు నెట్‌వర్క్'లు వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో కలిసి క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే కస్టమర్లకు ఏ నెట్‌వర్క్ కార్డును ఇవ్వాలనేది బ్యాంకులు, ఆర్థిక సంస్థలే నిర్ణయిస్తున్నాయి. ఇది ప్రధానంగా ఆయా నెట్‌వర్క్‌లతో వాటికి ఉన్న ఒప్పందాలపై ఆధారపడి ఉంటోంది. దీని వల్ల కస్టమర్లకు, తమకు నచ్చిన కార్డ్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే అవకాశం లేకుండా పోతోంది. అందుకే ఆర్బీఐ దీనిని పూర్తిగా సమీక్షించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మార్చేందుకు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 కింద దఖలుపడిన అధికారాలను ఉపయోగించి, బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇతర నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా పరిమితులు విధించే కార్డు నెట్‌వర్క్‌లతో ఒప్పందాలు చేసుకోకూడదు.
2. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ యూజర్లకు, నచ్చిన నెట్‌వర్క్ నుంచి కార్డును ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలి.
3. ఇప్పటికే క్రెడిట్/డెబిట్ కార్డు కలిగి ఉన్నవారికి రెన్యువల్ సమయంలో నచ్చిన నెట్‌వర్క్‌కు మారే అవకాశాన్ని కల్పించాలి.
కార్డ్ నెట్‌వర్క్‌ల జాబితా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారత దేశంలో అనుమతి ఉన్న కార్డు నెట్‌వర్క్‌ల జాబితాను విడుదల చేసింది. అవి ఏమిటంటే,
1. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్