National Savings Certificate Scheme :చాలా మందికి పెట్టుబడి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్లు. మంచి రాబడితోపాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయని వాటిలో పెట్టుబడి పెడుతుంటారు. అలాగే బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుందని భావిస్తారు. అలాంటి వారికి పోస్ట్ ఆఫీస్'నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్'పథకం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ప్రభుత్వ స్కీంలో పెట్టుబడిపెడితే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, పన్ను మినహాయింపులు సహా బోలెడ్ ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా బ్యాంక్‌ల్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ లభిస్తుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్బీఐ ఎఫ్‌డీతో పోలిస్తే అధిక రాబడి :నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ 7.7% స్థిర వడ్డీ రేటును అందిస్తోంది. ఇది ఎస్బీఐతో సహా అనేక ఇతర బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDలు) ఇచ్చే వడ్డీ రేటు కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు ఎస్బీఐ ప్రస్తుతం 5 సంవత్సరాల వ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీని అందిస్తుంది. కానీ ఎన్‌ఎస్‌సీలో 7.7 శాతం వడ్డీ లభిస్తుంది.
రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు :సెక్షన్ 80సి కింద, ఎన్‌ఎస్‌సీలో పెట్టుబడి పెట్టిన డబ్బుపై సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
NSC Scheme Benefits :
కనీస పెట్టుబడి : మీరు కేవలం రూ.1000 కనీస మొత్తంతో ఈ స్కీంలో పెట్టుబడి పెట్టవచ్చు.