NPS Scheme Benefits : మీరు భవిష్యత్ కోసం మంచి ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడదామని అనుకుంటున్నారా? రిటైర్మెంట్ తరువాత రూ.5 కోట్ల నిధితోపాటు, నెలకు రూ.1 లక్ష చొప్పున పెన్షన్ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.
National Pension Scheme :భారతదేశంలో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) అనే బెస్ట్ స్కీమ్ ఉంది. ఇది మంచి పెట్టుబడి మార్గంగానూ, పదవీ విరమణ ప్రణాళికగానూ ఉపయోగపడుతుంది. ఈ పథకం వల్ల మంచి ఆదాయం మాత్రమే కాదు, పన్ను ప్రయోజనాలు కూడా చేకూరతాయి. అయితే 60 ఏళ్ల వయస్సు దాటిన తరువాత లేదా పదవీ విరమణ చేసిన తరువాత, ఎన్‌పీఎస్ స్కీమ్ ద్వారా పొందిన ఆదాయంలో కనీసం 40 శాతాన్ని యాన్యుటీలోకి మార్చాలి. దీని వల్ల సదరు వ్యక్తికి జీవితాంతం పెన్షన్ రూపంలో ఆదాయం వస్తూ ఉంటుంది. మిగిలిన 60 శాతాన్ని ఏక మొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకే ఈ పథకం గురించి ఒక చిన్న ఉదాహరణ ద్వారా వివరంగా తెలుసుకుందాం.
ఉదాహరణకు : ఒక 27 ఏళ్ల వ్యక్తి నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టి, తనకు 60 ఏళ్లు వచ్చే వరకు దానిని కొనసాగించాడని అనుకుందాం. అప్పుడు తన లైఫ్ గోల్ అయిన నెలకు రూ.1 లక్ష పెన్షన్, రూ.5 కోట్ల రిటైర్మెంట్ నిధి సంపాదించగలడా? లేదా? అనేది లెక్కలేసి చూద్దాం.
- పెట్టుబడిదారుని వయస్సు = 27 సంవత్సరాలు
- పెట్టుబడి కాలం = 33 ఏళ్లు (27 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు)
- సంవత్సరానికి పెట్టుబడి = రూ.2,00,000
- రాబడి రేటు (అంచనా) = సంవత్సరానికి 10%
- యాన్యుటీ కొనుగోలు - స్కీమ్ ద్వారా పొందిన నిధిలో 40 శాతం
- ఆశించిన యాన్యుటీ రేటు - సంవత్సరానికి 6%
మొత్తం పెట్టుబడి (Total Investment)
∴ మొత్తం పెట్టుబడి = రూ.2,00,000 X 33 ఏళ్లు = రూ.65,99,736
ఎన్‌పీఎస్ స్కీమ్ ద్వారా పోగయ్యే మొత్తం నిధి (Accumulated Corpus)
సంవత్సరానికి 10 శాతం రాబడి వచ్చింది అని అనుకుంటే, 33 ఏళ్ల తరువాత పొగయ్యే మొత్తం నిధి (Accumulated Corpus) సుమారుగా రూ.5,19,15,841 అవుతుంది.
మొత్తం రాబడి
(మొత్తం రాబడి = మొత్తం నిధి - మొత్తం పెట్టుబడి) ఈ సూత్రం ప్రకారం