Upcoming Two-Wheelers In India 2024 :మంచి పెర్ఫార్మెన్స్, మైలేజ్ ఇచ్చే బైక్స్, స్కూటర్స్ కోసం వినియోగదారులు ఎదురుచూస్తుంటారు. అందు కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. దీనిని క్యాష్ చేసుకునేందుకు హీరో, బజాజ్, యమహా, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి పలు ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే 12 నెలల్లో ఇండియన్ మార్కెట్లో తమ లేటెస్ట్ బైక్స్ & స్కూటర్స్ లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. Suzuki Access 125 Facelift :సుజుకి యాక్సెస్ 125 అప్డేట్ మోడల్ త్వరలో లాంఛ్ కానుంది. 2016 తర్వాత ఈ మోడల్ అంతగా అప్డేట్ కాలేదు. పవర్ట్రైన్లోనూ మార్పులు చేయలేదని తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ సుజుకి స్కూటర్‌ను తీర్చిదిద్దారట. కనుక ఈ మోడల్ వేరే స్కూటీలతో పోలిస్తే మరింత అందంగా కనిపించనుంది. ఈ మోడల్ స్కూటీ మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను, మైలేజ్‌ను ఇస్తుంది.
2. Hero Xoom 125R & Xoom 160 :హీరో మోటార్ కార్ప్ అధికారికంగా Xoom 125R, Xoom 160 అడ్వెంచర్ స్కూటర్లను త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. Xoom 160 మోడల్ బైక్ 156 సీసీ ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.
3. New Husqvarna Svartpilen 250 :హస్క్వర్నా మోటార్ సైకిల్ భారత్‌లో 'స్వర్ట్పిలెన్ 250'కు పేటెంట్ పొందింది. ఈ మోడల్ ఈ ఏడాది భారత మార్కెట్లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితం ఈ స్వీడిష్ బ్రాండ్ విట్పిలెన్ 250, స్వర్ట్పిలెన్ 401 బైక్‌లను భారత్ మార్కెట్లోకి తెచ్చింది. వీటిలో పొందుపరిచిన 250 సీసీ ఇంజిన్నే అప్‌కమింగ్ స్వర్ట్పిలెన్ 205 బైక్‌లోనూ అమర్చే అవకాశం ఉంది.
4. Bajaj Pulsar NS400, New Chetak & CNG Bike :మాస్ మార్కెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని బజాజ్ కంపెనీ రానున్న నెలల్లో న్యూ చేతక్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతకంటే ముందు పల్సర్ NS 400 మోడల్‌ను ఈ మే 3న లాంఛ్ చేయనుంది. దీని ధర దాదాపు రూ.2 లక్షలు (ఎక్స్-షోరూమ్). అలాగే ఇండస్ట్రీ ఫస్ట్ 'సీఎన్జీ బైక్'ను కూడా ఈ ఏడాది జూన్ లేదా జులైలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.