Personal Loan For 15000 Salary : ఆర్థిక అవసరాలు ఎప్పుడు, ఏ విధంగా వస్తాయో చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా డబ్బులు కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ గుర్తొచ్చేవి వ్యక్తిగత రుణాలు. వీటికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
అయితే పర్సనల్ లోన్ అప్రూవల్ అవ్వాలంటే రుణదాత తొలుత దరఖాస్తుదారుడి నెలవారీ జీతాన్ని పరిశీలిస్తారు. అయితే కొందరికి నెలకు రూ.15 వేలు జీతం వస్తుంది. వీళ్లకు పర్సనల్ అప్రూవల్ అవుతుందా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. పర్సనల్ లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్, స్థిరమైన వేతనాన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ, తక్కువ జీతం వచ్చినవారికి కూడా రుణాలను మంజూరు చేసే అనేక బ్యాంకులు ఉన్నాయి.
అధిక వడ్డీరేటు వసూలు
కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. తక్కువ జీతం వచ్చేవారికి ఇచ్చే పర్సనల్ లోన్‌పై రుణదాతలు అధిక వడ్డీ రేటును విధిస్తారు. పైగా రుణంగా మీకు అందించే అసలు మొత్తం మీరు ఆశించిన దానికంటే తక్కువగా ఉండొచ్చు. అందువల్ల, బలమైన ప్రొఫైల్‌ను నిర్మించడానికి మీరు మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటైన్ చేయాలి. అలాగే స్థిరమైన ఉపాధిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. రూ.15వేలు జీతం వచ్చే వారికి పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తున్న రుణసంస్థలు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. క్రెడిట్ బీ
వడ్డీ రేటు : 16 శాతం నుంచి
గరిష్ఠ రుణ మొత్తం : రూ. 5 లక్షల వరకు
లోన్ కాలవ్యవధి : 3 సంవత్సరాల వరకు
కనీస వేతనం అర్హత : రూ.10 వేలు
2. పేసెన్స్
వడ్డీ రేటు : 1.4 శాతం నుంచి
గరిష్ఠ రుణ మొత్తం : రూ. 5 లక్షల వరకు
లోన్ కాలవ్యవధి : అప్లికేషన్ ప్రొఫైల్ ప్రకారం ఆధారపడి ఉంటుంది.
కనీస వేతనం అర్హత : రూ.12 వేలు
3. మనీవ్యూ
వడ్డీ రేటు : 14 శాతం నుంచి
గరిష్ఠ రుణ మొత్తం : రూ. 10 లక్షల వరకు
లోన్ కాలవ్యవధి : 5 ఏళ్ల వరకు
కనీస వేతనం అర్హత : రూ.13,500
4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వడ్డీ రేటు : 11.45 శాతం నుంచి
గరిష్ఠ రుణ మొత్తం : రూ. 30 లక్షల వరకు
లోన్ కాలవ్యవధి : ఆరు సంవత్సరాల వరకు
కనీస వేతనం అర్హత : రూ.15,000
5. యాక్సిస్ బ్యాంక్
వడ్డీ రేటు : 11.25 శాతం నుంచి
గరిష్ఠ రుణ మొత్తం : రూ. 10 లక్షల వరకు
లోన్ కాలవ్యవధి : ఐదు సంవత్సరాల వరకు
కనీస వేతనం అర్హత : రూ.15,000
6. టాటా క్యాపిటల్
వడ్డీ రేటు : 11.99 శాతం నుంచి
గరిష్ఠ రుణ మొత్తం : రూ. 35 లక్షల వరకు
లోన్ కాలవ్యవధి : ఆరు సంవత్సరాల వరకు
కనీస వేతనం అర్హత : రూ.15,000
7. క్యాష్ ఈ
వడ్డీ రేటు : 2.25 శాతం నుంచి
గరిష్ఠ రుణ మొత్తం : రూ. 4లక్షల వరకు
లోన్ కాలవ్యవధి : ఏడాదిన్నర(18 నెలలు) వరకు
కనీస వేతనం అర్హత : రూ.15,000
8. స్టాష్ ఫిన్
వడ్డీ రేటు : 11.99 శాతం నుంచి
గరిష్ఠ రుణ మొత్తం : రూ. 5లక్షల వరకు
లోన్ కాలవ్యవధి : 4 సంవత్సరాల వరకు
కనీస వేతనం అర్హత : రూ.15,000
9. ఫైబ్ ఈ (ఎర్లీ శాలరీ)
వడ్డీ రేటు : 16 శాతం నుంచి
గరిష్ఠ రుణ మొత్తం : రూ. 5లక్షల వరకు
లోన్ కాలవ్యవధి : 3 సంవత్సరాల వరకు
కనీస వేతనం అర్హత : రూ.15,000
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి
- తక్కువ సాలరీ వచ్చినా పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపర్చుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందాలంటే మంచి సిబిల్ స్కోరు మెయింటెయిన్ చేయండి.
- అలాగే మంచి ఆదాయం, మెరుగైన సిబిల్ స్కోరు ఉన్న వ్యక్తిని కో-అప్లికెంట్ గా పెట్టి లోన్ అప్లై రుణం కోసం అప్లై చేయండి.
- మెరుగైన ప్రొఫైల్ ని మెయింటైన్ చేయడంలో మీకు సహాయపడే అద్దె ఆదాయం, పెట్టుబడులు వంటి బ్యాంక్ స్టేట్ మెంట్లు, పత్రాలను సేకరించి దరఖాస్తు చేసుకోండి.
- మార్కెట్లోని ఇతర రుణాలతో పోలిస్తే ఈ లోన్లులు అధిక వడ్డీ రేటుతో రుణాన్ని ఇస్తాయి కనుక మీకు నిజంగా వ్యక్తిగత రుణం అవసరమా? అని అంచనా వేయడం చాలా ముఖ్యం. మీ బడ్జెట్‌కు బాగా సరిపోయే ఇతర ఆప్షన్‌ను కూడా పరిశీలించండి.