ETV Bharat / state

పక్షం రోజుల్లోనే DNA నిర్ధారణ - ఎన్​జీఎస్​ టెక్నాలజీతో మెరుగైన ఫలితాలు - DNA CONFIRMATION

టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌లో నెలకు 100 కేసుల్లో నివేదికలు - పక్షం రోజుల్లో వస్తున్న డీఎన్​ఏ రిజల్ట్ - సత్ఫలితాలను ఇస్తున్న ఎన్​జీఎస్​ టెక్నాలజీ

DNA Confirmation
DNA Confirmation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 2:10 PM IST

DNA Confirmation : నేరం ఏదైనా సరే నిందితుడిని పట్టుకోవడం అంత తేలిక కాదు. కానీ ఒకే ఒక్క టెస్ట్​ ద్వారా ఆ పరిసరాలను జల్లేడ పడుతూ చిన్న వెంట్రుక, చెమట చుక్క వంటి వాటిని దొరకబుచ్చుకొని సులభంగా నేరస్థుడు ఎవరనేది స్పష్టంగా చెప్పేస్తోంది. అదే డీఎన్​ఏ నిర్ధారణ పరీక్ష. కానీ ఈ డీఎన్​ఏ పరీక్షను చేయాలంటే గరిష్ఠంగా 3 నెలల వరకు సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ అధిగమిస్తూ కేవలం 24 గంటల్లో లేదా 15 రోజుల్లోనే పూర్తి నివేదిక పోలీసులకు అందుతుంది. దీన్ని ఎన్​జీఎస్​(నెక్ట్స్​ జనరేషన్​ సీక్వెన్సింగ్​) అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థులను తొందరగా గుర్తిస్తున్నారు.

తెలంగాణ ఫోరెన్సిక్​ ల్యాబోరేటరీ (టీజీఎఫ్​ఎస్​ఎల్​)లో డీఎన్​ఏ నిర్ధారణ అత్యంత తక్కువ సమయంలో నివేదికలు రూపొందించే పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. దీనికి నెక్ట్స్​ జనరేషన్​ సీక్వెన్సింగ్​ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మాదిరి కాకుండా కేవలం కనిష్ఠంగా అయితే 24 గంటల్లోపు, గరిష్ఠంగా 15 రోజుల్లోపు నివేదికలను పోలీసులకు అందజేస్తున్నారు. పోక్సో కేసుల్లో అయితే మాత్రం వీలైనంత తొందరగానే విశ్లేషించి నివేదిక ఇస్తున్నారు.

పక్షం రోజుల్లో రిజల్ట్ : సామూహిక అత్యాచార కేసుల్లో మాత్రం గరిష్ఠంగా 3 నెలల వరకు సమయం తీసుకుంటుండగా, ఇలాంటి కేసుల్లో పలువురి డీఎన్​ఏలను విశ్లేషించాల్సిన అవసరం రావడంతో కొంత సమయం తీసుకోవాల్సి వస్తోంది. అంతకుముందు ఇలాంటి కేసుల్లో అయితే డీఎన్​ఏ నిర్ధారణకు 2నుంచి3 నెలల సమయం పట్టేది, అలాగే కొన్ని కేసుల్లో అయితే ఏకంగా ఏడాది సమయం పట్టేది. ఇప్పుడు ఎన్​జీఎస్​ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పలు ఇబ్బందులు దూరం అయ్యాయి.

తద్వారా నేరాల దర్యాప్తులో జాప్యాన్ని తగ్గించి నివారించగలుగుతున్నారు. ఈమేరకు పోలీసులు న్యాయస్థానాల్లో అభియోగపత్రాలను తొందరగా దాఖలు చేసి దర్యాప్తును ముగిస్తున్నారు. వాస్తవానికి నేరపరిశోధన క్రమంలో పలు కేసుల్లో డీఎన్​ఏ నిర్ధారణే అత్యంత కీలకం. ముఖ్యంగా ఆనవాళ్లు తెలియని మృతదేహాలను గుర్తించడంలో, జీవ సంబంధాన్ని నిర్ధరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి కేసులు నెలకు సగటున వంద వరకు టీజీఎఫ్​ఎస్​ఎల్​కు వస్తుంటాయి.

అన్ని కేసుల్లోనూ పురోగతి : గతంలో ఎఫ్​ఎస్​ఎల్​లో సరైన వనరులు అందుబాటులో ఉండేవి కావు. సాంకేతిక అంత బలంగా లేకపోవడంతో నేరాల విశ్లేషణకు చాలా జాప్యం జరిగేది. కానీ కీలకమైన కేసుల్లో మాత్రమే ప్రత్యేక చొరవ తీసుకొని తొందరగా నివేదికను ఇచ్చేవారు. గతంలో మహబూబ్​నగర్​ జిల్లా పాలెంలో బస్సు దగ్ధం దుర్ఘటన కేసులో రేయింబవళ్లు పనిచేసి వారం రోజుల్లోనే డీఎన్​ఏ సీక్వెన్సింగ్​ను పూర్తి చేశారు. ఇప్పుడు ఎన్​జీఎస్​ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో దాదాపు అన్ని కేసుల్లోనూ ఇలాంటి పురోగతి వస్తుంది. దీంతో పక్షం రోజుల్లోనే నివేదికలు రూపొందించి పోలీసులకు అందజేయగలుగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.