How to Upgrade 2 Wheeler Licence to 4 Wheeler : చాలా మంది ముందుగా టూ వీలర్ తీసుకొని దానికి డ్రైవింగ్ లైసెన్స్ పొందుతుంటారు. ఆ తర్వాత ఇంటి అవసరాలు, ఉద్యోగం, వ్యాపారం ఇలా వివిధ అవసరాల దృష్ట్యా మరో వాహనం తీసుకుంటుంటారు. కారు, ఆటో ఇంకా మరేదైనా వెహికల్ కావొచ్చు. అయితే, ఇలా మరో వెహికల్ తీసుకున్నప్పుడు దానికోసం సెపరేట్‌గా ఇంకో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా ఉన్న టూ వీలర్ లైసెన్స్లోనే ఆ వెహికల్ని యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. చాలా సింపుల్‌గా ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇందుకోసం ముందుగా కొత్త వాహనం కోసం లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి. అందుకోసం స్లాట్ బుక్ చేసుకొని మీరు ఎంచుకున్న ఆర్టీఏ ఆఫీస్‌లో డెమో టెస్ట్ క్లియర్ చేయాలి. ఆ తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేసుకొని టెస్ట్ డ్రైవ్ పూర్తి చేస్తే మీకు కొత్త వాహనం యాడ్ అయిన న్యూ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.
అవసరమైన పత్రాలు :
- మునుపటి డ్రైవింగ్ లైసెన్స్
- ఆధార్ కార్డ్
- అడ్రస్ ప్రూఫ్
డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ బిగులు - ఇలా ఫోన్లోనే "లెర్నర్" పొందండి!
న్యూ వెహికల్ లెర్నర్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే?
- ముందుగా తెలంగాణ RTA అధికారిక పోర్టల్ https://transport.telangana.gov.in/ ని సందర్శించాలి.
- అప్పుడు హోమ్ పేజీలో రైట్ సైడ్ "For Online Services and Payments Click Here" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే న్యూ పేజీ ఓపెన్ అవుతుంది.
- ఓపెన్ అయిన కొత్త పేజీలో "Learner Licence for Addition of a New Class of Vehicle" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆపై ఓపెన్ అయిన పేజీలో Continue Slot Booking అనే ఆప్షన్‌పై నొక్కాలి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో Learner Licence for Addition of a New Class of Vehicle అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- అప్పుడు దాని కింద డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, ఇష్యూ డేట్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ అడుగుతుంది. అవి ఎంటర్ చేస్తే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయాలి.
- ఆ తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ డిస్ప్లే అవుతుంది. అప్పుడు గెట్ డిటెయిల్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మీ వివరాలు ఓపెన్ అవుతాయి.
- అవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాత ఆధార్ నంబర్, అడ్రస్ ప్రూఫ్ వంటి మిగిలిన వివరాలను ఎంటర్ చేయాలి.
- ఆపై మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో యాడ్ చేయాలనుకుంటున్న మీ న్యూ వెహికల్ క్లాస్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వివరాలన్నీ సరి చూసుకొని సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్‌పై నొక్కాలి.
- అప్పుడు లెర్నింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ కోసం తగిన తేదీని సెలెక్ట్ చేసుకోవాలి.(అక్కడ పేర్కొన్న విధంగా అందుబాటులో ఉన్న సమయ స్లాట్‌లను ఎంచుకోవాలి)
- ఇక చివరగా దానికి తగిన చెల్లింపును పూర్తి చేయాలి. ఆపై అప్లికేషన్ ప్రింట్‌పై నొక్కి అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీరు ఎంచుకున్న సమయంలో ఆర్టీఏ ఆఫీస్‌లో డెమో టెస్ట్ క్లియర్ చేస్తే లెర్నింగ్ లైసెన్స్ వస్తుంది.
ఇక్కడ లైసెన్స్ తీసుకోండి - విదేశాల్లో డ్రైవ్ చేయండి!
పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేయాలంటే?
- లెర్నింగ్ లైసెన్స్ పొందాక 30 రోజులు కంప్లీట్ అయితే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి.
- ముందుగా తెలంగాణ RTA అధికారిక పోర్టల్ https://transport.telangana.gov.in/ ని సందర్శించాలి.
- ఆ తర్వాత "For Online Services and Payments Click Here" అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అప్పుడు అక్కడ "Addition of Class of Vehicle to Driving Licence" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు డిస్ప్లే అవుతాయి.
- అవి చెక్ చేసుకొని మరో విభాగానికి వెళ్లి.. డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం మీకు ఇష్టమైన తేదీ, సమయాన్ని ఎంచుకుని, చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలి. ఆపై అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీరు ఎంచుకున్న సమయానికి డ్రైవింగ్ లైసెన్స్ కోసం RTA కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ క్లియర్ చేయాలి. ఆపై 20-30 రోజుల్లో కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ని అందుకుంటారు.
మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా? - డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని తెలుసా